4 రోజుల్లో 15.41 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కించుకున్న హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ “లిటిల్ హార్ట్స్”

0
426
Little Hearts Collects 15.41 Crores Gross in Just 4 Days
Little Hearts Collects 15.41 Crores Gross in Just 4 Days

4 రోజుల్లో 15.41 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కించుకున్న హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ “లిటిల్ హార్ట్స్”

మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన “లిటిల్ హార్ట్స్” సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు.

హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన “లిటిల్ హార్ట్స్” సినిమా రోజు రోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ తో దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి 4 రోజుల్లో 15.41 కోట్ల రూపాయల వసూళ్లు దక్కాయి. చిన్న చిత్రాల్లో ఈ రేంజ్ వసూళ్లు రావడం విశేషమని చెప్పుకోవచ్చు. ఈ ట్రెండ్ చూస్తే ఫస్ట్ వీక్ మరిన్ని గ్రేట్ నెంబర్స్ “లిటిల్ హార్ట్స్” క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నటీనటులు – మౌళి తనూజ్, శివానీ నాగరం, రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్, తదితరులు

టెక్నికల్ టీమ్

రచన, దర్శకత్వం – సాయి మార్తండ్
ప్రొడ్యూసర్ – ఆదిత్య హాసన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
మ్యూజిక్ – సింజిత్ యెర్రమల్లి
సినిమాటోగ్రఫీ – సూర్య బాలాజీ
ఎడిటర్ – శ్రీధర్ సొంపల్లి
ఆర్ట్ డైరెక్టర్ – దివ్య పవన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – వినోద్ నాగుల, మురళి పున్న
డిస్ట్రిబ్యూషన్ – బన్నీవాస్, వంశీ నందిపాటి
డిస్ట్రిబ్యూషన్ బ్యానర్స్ – బీవీ వర్క్స్, వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here