సత్తా ఉన్నా సినిమా, సత్తా చాటిన సినిమా. రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న మై బేబీ… మరోసారి తన బ్రాండ్‌ను నిరూపించుకున్న సురేష్ కొండేటి, ఎస్.కె. పిక్చర్స్.

0
502
My Baby Three Days Collections
My Baby Three Days Collections

సత్తా ఉన్నా సినిమా, సత్తా చాటిన సినిమా. రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న మై బేబీ… మరోసారి తన బ్రాండ్‌ను నిరూపించుకున్న సురేష్ కొండేటి, ఎస్.కె. పిక్చర్స్.

అధర్వ, నిమిషా సాజయన్ హీరో, హీరోయిన్‌లుగా, నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో, నిర్మాత సురేష్ కొండేటి మరియు సహ నిర్మాతలుగా సాయి చరణ్ తేజ పుల్లా, దుప్పటి గట్టు సారిక రెడ్డి సంయుక్తంగా విడుదల చేసిన చిత్రం “మై బేబీ” ఈ నెల 18 జూలై 2025న విడుదలైంది. విడుదలైనప్పటి నుండి రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తూ,విడుదలైన మూడు రోజులకే రికార్డు స్థాయిలో 35 లక్షల రూపాయలు వసూళ్లు చేసి, ఇటీవల విడుదలైన చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సాధించింది.థియేటర్‌లో చూసిన ప్రతి ఒక్కరికీ ఒక మంచి అనుభూతిని కలిగిస్తోంది. ఈ సినిమా అమ్మ తాలూకు ప్రేమను, నాన్న తాలూకు బాధ్యతను కలిపిన కథగా మంచి పేరు తెచ్చుకుంది.

కొన్ని రోజుల విరామం తర్వాత మళ్లీ తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఎస్.కె. పిక్చర్స్, ఏ మాత్రం తన బ్రాండ్ ఇమేజ్‌ను తగ్గించుకోలేదు అని మళ్లీ నిరూపించుకుంది. ఒక మంచి కథతో వస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అనే విషయం మరోసారి రుజువైంది.

ఇంతటి గొప్ప విజయం ఇచ్చినందుకు, మళ్లీ మా ప్రయాణాన్ని ప్రారంభించే భరోసా కలిగించినందుకు తెలుగు ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here