అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ కు భారీ ఆఫర్
అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అటెన్షన్ అంతా ఇంతా కాదు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ గట్రా జనాల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేశాయి. గూఢచారి, క్షణం సినిమాలకు పని చేసిన షానియేల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
ఆ మధ్య రిలీజైన ఈ సినిమా టీజర్ కూడా ఒక రేంజ్లో ఆకట్టుకుంది. ఒక రోడ్డు మీద కుప్పలు కుప్పలుగా పడి ఉన్న శవాల మధ్య గతంలో గాఢంగా ప్రేమించుకుని ఇప్పుడు బద్ద శత్రువులా మారిన ఒక జంట గురించి చూపించారు. ఒకరు మెషీన్ గన్, మరొకరు తుపాకీ పట్టుకుని ఒకరినొకరు కాల్చుకునేందుకు సిద్దపడతారు. అమర ప్రేమికులు బద్ద శత్రువుల్లా ఎందుకు మారారో తెలుసుకోవాలంటే సినిమా వచ్చే వరకు చూడాల్సిందే అనేలా టీజర్‌తో క్యూరియాసిటీ క్రియేట్ చేశారు.
అయితే, టీజర్ తర్వాత ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ రాలేదు. కాగా తాజాగా ఈ సినిమాకు ఓ భారీ ఆఫర్ తగిలింది. అదేంటంటే.. ఈ సినిమా ఆడియో హక్కులను సోనీ సంస్థ దక్కించుకుంది. కాగా అక్షరాల రూ.8 కోట్లకు సోనీ సంస్థ ఆడియో రైట్స్‌ను కొనుగోలు చేసిందని తెలుస్తుంది. అడివిశేష్ కెరీర్లోనే ఇది రికార్డు. ఇక ఈ సినిమాకు లేటెస్ట్ సెన్సేన్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.



