సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం “దిల్ రూబా” సినిమా స్టోరీ లైన్ ఊహించి చెబితే బైక్ గిఫ్ట్

0
347
Kiran Abbavaram Dil Ruba COntest
Kiran Abbavaram Dil Ruba COntest

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం “దిల్ రూబా” సినిమా స్టోరీ లైన్ ఊహించి చెబితే బైక్ గిఫ్ట్

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా “దిల్ రూబా”. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. “దిల్ రూబా” చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. “దిల్ రూబా” సినిమా మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు “దిల్ రూబా” నుంచి ఓ కాంటెస్ట్ అనౌన్స్ చేశారు హీరో కిరణ్ అబ్బవరం. “దిల్ రూబా” స్టోరీ లైన్ ఊహించి చెప్పిన వాళ్లకు ఈ సినిమాలో హీరో నడిపిన బైక్ గిఫ్ట్ గా అందించబోతున్నారు. “దిల్ రూబా” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజేతకు బైక్ అందించడంతో పాటు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో అదే బైక్ మీద సినిమా చూసేందుకు కిరణ్ అబ్బవరం వెళ్తారు. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన కంటెంట్, సాంగ్స్, ప్రెస్ మీట్స్ లో టీమ్ చెప్పిన డీటెయిల్స్ తో “దిల్ రూబా” స్టోరీ లైన్ గెస్ చేసిన ఎవరైనా ఈ స్పెషల్లీ డిజైన్డ్ బైక్ సొంతం చేసుకోవచ్చు.

నటీనటులు – కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్, తదితరులు

టెక్నికల్ టీమ్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్) & దుడ్డి శ్రీను.
ప్రొడక్షన్ డిజైనర్ – సుధీర్
ఎడిటర్ – ప్రవీణ్.కేఎల్
సినిమాటోగ్రఫీ – డానియేల్ విశ్వాస్
మ్యూజిక్ – సామ్ సీఎస్
నిర్మాతలు – రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి,సారెగమ.
రచన, దర్శకత్వం – విశ్వ కరుణ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here