సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి చిత్రం “ప్రేమచరిత్ర – కృష్ణ విజయం” సంక్రాంతి కానుకగా జనవరి 3 విడుదల!!

0
184
Superstar Krishna Last Film Premacharitra Krishna Vijayam Press Meet
Superstar Krishna Last Film Premacharitra Krishna Vijayam Press Meet

సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల గుండెల్లో దర్శకనిర్మాత మధుసూదన్ కు శాశ్వత స్థానం!!

సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి చిత్రం “ప్రేమచరిత్ర – కృష్ణ విజయం” సంక్రాంతి కానుకగా జనవరి 3 విడుదల!!

సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల గుండెల్లో దర్శకనిర్మాత మధుసూదన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు “ప్రేమ చరిత్ర – కృష్ణ విజయం” రిలీజ్ డేట్ ప్రకటన ప్రెస్ మీట్ లోపాల్గొన్న అతిధులు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి చిత్రం “ప్రేమ చరిత్ర – కృష్ణ విజయం”. అంబుజా మూవీస్ – రామ్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై హెచ్.మధుసూదన్ దర్శకనిర్మాతగా రూపొందిన ఈ చిత్రంలో యశ్వంత్–సుహాసిని జంటగా నటించగా… నాగబాబు, ఆలీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు!!

ఈ చిత్రం జనవరి 3, సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సందర్భంగా పత్రికా సమావేశం నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ పర్సనల్ మేకప్ మేన్ మాధవరావు, ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, రత్నమయ్య, ప్రముఖ సాహితీవేత్త – గీత రచయిత బిక్కి కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖాదర్ గోరి, ప్రముఖ చిత్రకారిణి శ్రీమతి వాసిరెడ్డి స్పందన, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ, దర్శకనిర్మాత హెచ్.మధుసూదన్, సహనిర్మాత ఎం. శంకర్ ఈ వేడుకలో పాల్గొన్నారు!!

Superstar Krishna Last Film Premacharitra Krishna Vijayam Press Meet
Superstar Krishna Last Film Premacharitra Krishna Vijayam Press Meet

“ప్రేమచరిత్ర – కృష్ణ విజయం” కృష్ణ నటించిన చివరి చిత్రంగా చరిత్రలో నిలిచిపోతుందని, కృష్ణను అభిమానించే ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడాలని అతిధులు ఆకాంక్షించారు. సూపర్ స్టార్ కృష్ణకు సంక్రాంతితో గల అనుబంధాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. దర్శకనిర్మాత మధుసూదన్ పేరు సైతం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అభినందించారు!!

దర్శకనిర్మాత మధుసూదన్ మాట్లాడుతూ… “సూపర్ స్టార్ కృష్ణతో సినిమా రూపొందించడం తన అదృష్టంగా భావించానని, ఆయన నటించిన ఆఖరి చిత్రం విడుదల కాని చిత్రాల జాబితాలో ఉండకూడదనే పట్టుదలతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామని తెలిపారు. ఆధునిక సాంకేతిక హంగులన్నీ అద్దుకున్న ఈ చిత్రం కృష్ణ అభిమానులతోపాటు అందరినీ అమితంగా అలరిస్తుందని మధుసూదన్ ఆకాంక్షించారు!!

Superstar Krishna Last Film Premacharitra Krishna Vijayam Press Meet
Superstar Krishna Last Film Premacharitra Krishna Vijayam Press Meet

ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి పబ్లిసిటీ డిజైనర్: శ్రీకాంత్, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, సహ నిర్మాతలు; బండ్రి నాగరాజ్ గుప్తా – బి.వెంకటేష్ శెట్టి – శ్రీపాద హన్ చాటే – ఎం. శంకర్, కథ -స్క్రీన్ ప్లే – మాటలు – నిర్మాణం – దర్శకత్వం: హెచ్. మధుసూదన్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here