ఘనంగా జరిగిన ఫిలిం ఫైనాన్స్ బంగారు బాబు కొడుకు నిశ్చితార్థం

0
236
Bangaru Babu Son Wedding
Bangaru Babu Son Wedding

ఘనంగా జరిగిన ఫిలిం ఫైనాన్స్ బంగారు బాబు కొడుకు నిశ్చితార్థం 

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నెన్నో ప్రతిష్టాత్మక చిత్రాలకు ఫైనాన్స్ చేసిన ప్రముఖ ఫిలిం ఫైనాన్సర్ , ఆర్ – సెక్యూర్డ్ ఫైనాన్స్ అధినేత బంగారు బాబు ( ఈ.వి. రాజారెడ్డి) చిన్న కుమారుడు క్రాంతి రెడ్డి నిశ్చితార్థ మహోత్సవం ప్రముఖ పారిశ్రామికవేత్త సీతా రామిరెడ్డి – రామ సీత దంపతుల కుమార్తె శిరీష తో హోటల్ తాజ్ కృష్ణ లో ఈరోజు (డిసెంబర్ 15) ఘనంగా జరిగింది .ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ , వ్యాపార, ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులకు అభినందనలు తెలియజేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ లోని ప్రముఖ నిర్మాతలు, దర్శకులు అందరి తోటి విశేషమైన అనుబంధం కలిగిన బంగారు బాబు కుమారుని నిశ్చితార్థ మహోత్సవానికి చలనచిత్ర ప్రముఖులందరూ తరలి రావడం విశేషం. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు కె. ఎస్.రామారావు, సి.కళ్యాణ్, శ్యాం ప్రసాద్ రెడ్డి, పోకూరి బాబురావు, సునీల్ నారంగ్, కె.అచ్చిరెడ్డి, జెమినీ కిరణ్, సాహు గార్లపాటి, డాక్టర్ కే. వెంకటేశ్వరరావు, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రవి, ఎర్నేని నవీన్, డి.వి.వి. దానయ్య, బెల్లంకొండ సురేష్, కె రాధా మోహన్, సితార ఎంటర్టైన్మెంట్స్ వంశీ, యు వి క్రియేషన్స్ విక్కీ, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ పి.డి. ప్రసాద్ ,లగడపాటి శ్రీధర్ , ఆంధ్రజ్యోతి ఎం.డి .రాధాకృష్ణ, గోపి ఆచంట, ప్రముఖ నటులు చక్రపాణి, వడ్డే నవీన్, కిరణ్ అబ్బవరం, నవభారత్ బాలాజీ , మాగంటి సుధాకర్, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, ఎస్వీ కృష్ణారెడ్డి, మెహర్ రమేష్, సంపత్ నంది తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకకు ఇంతమంది సినీ ప్రముఖులు హాజరు కావటం చలనచిత్ర పరిశ్రమలో ఫైనాన్సర్ గా “బంగారు బాబు” కు ఉన్న గుర్తింపు, గౌరవాలకు నిదర్శనం అని విచ్చేసిన ప్రముఖులందరూ అభినందించారు.

Bangaru Babu Son Wedding
Bangaru Babu Son Wedding

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here