“కానిస్టేబుల్” మోషన్ పోస్టర్ విడుదల

0
194
Varun Sandesh - Constable Movie
Varun Sandesh - Constable Movie

“కానిస్టేబుల్” మోషన్ పోస్టర్ విడుదల

వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వం లో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం “కానిస్టేబుల్”. వరుణ్ సందేశ్ కి జోడిగా మధులిక వారణాసి హీరోయిన్ గా తొలిపరిచయం కానున్నారు. ఈ సినిమా కి సంబంధించిన మోషన్ పోస్టర్ ను .నిర్మాత కుమార్తె జాగృతి జన్మదినం సందర్భంగా గా బుధవారం సాయంత్రం డివో మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్ లో విడుదల చేశారు.

హీరో వరుణ్ సందేశ్ 

“సినిమాపై మేము పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగా మోషన్ పోస్టర్ కూడా చాలా బాగా వచ్చింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో కానిస్టేబుల్ గా కొత్తకోణం కలిగిన పాత్రలో నటిస్తున్నాను. ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. తప్పకుండ ఈ చిత్రం నా కెరీర్ ను మరో మలుపు తిప్పుతుంది” అని చెప్పారు.

నిర్మాత బలగం జగదీష్

“కథ, కధనాలు అద్భుతంగా అమరిన చిత్రమిది. పోలీస్ పాత్రలో వరుణ్ సందేశ్ ఆకట్టుకుంటారు” అని పేర్కొన్నారు..

దర్శకుడు ఆర్యన్ సుభాన్ SK 

“సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో వరుణ్ సందేశ్ నట విశ్వరూపం చూడవచ్చు. మోషన్ పోస్టర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఉంటుంది”అని తెలిపారు

నటీనటుల విషయానికి వస్తే

దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు తారాగణం.

టెక్నికల్ టీం

కెమెరా; హజరత్ షేక్ (వలి), సంగీతం :సుభాష్ ఆనంద్, ఎడిటింగ్: వర ప్రసాద్, B. G. M :గ్యాని, ఆర్ట్: వి. నాని, పండు, మాటలు :శ్రీనివాస్ తేజ, పాటలు: రామారావు, శ్రీనివాస్ తేజ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :మిట్టపల్లి జగ్గయ్య, సహనిర్మాత: బి నికిత జగదీష్, కుపేంద్ర పవర్, నిర్మాత; బలగం జగదీష్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం; :ఆర్యన్ సుభాన్ SK

Varun Sandesh – Constable Movie Motion Poster Click Here >>

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here