న్యాచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై మీట్ క్యూట్ మూవీ ప్రారంభం

0
353

నిర్మాతగా ‘అ!, హిట్‌’వంటి సూపర్‌హిట్‌ ఫిల్మ్స్‌ను ప్రేక్షకులకు అందించిన న్యాచులర్‌ స్టార్‌ నాని తాజాగా తన నిర్మాణ సంస్థ ‘వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై మరో మంచి సినిమాను సిద్ధం చేస్తున్నారు. ‘మీట్‌ క్యూట్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. నటుడు సత్యరాజ్ పై తెరకెక్కించిన ముహూర్తపు సన్నివేశానికి నేచురల్ స్టార్ నాని క్లాప్‌ కొట్టారు.

వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌ నుంచి ఇప్పటికే ‘అ!’, ‘హిట్‌’ వంటి కంటెంట్‌ ఉన్న సక్సెస్‌పుల్‌ సినిమాలు వచ్చిన తరుణంలో ‘మీట్‌ క్యూట్ కూడా అలాంటి కంటెంట్‌ డ్రివెన్‌ సినిమాయే అని తెలుస్తోంది. అలాగే ‘వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌’ పతాకం ద్వారా ప్రశాంత్‌ వర్మ, శైలేష్‌ కొలను వంటి ప్రతిభావంతులు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఇప్పుడు ఇదే బ్యానర్‌ నుంచి దీప్తి ఘంట అనే దర్శకులురాలు పరిచయంఅవుతోంది.

‘‘వాల్‌పోస్టర్స్‌ సినిమాలో ప్రొడక్షన్‌ నెంబరు 4గా ‘మీట్‌ క్యూట్’ ప్రారంభమైంది. ఈ సంధర్భంగా ఈ కొత్త ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనది’’ అని అంటూ నాని ట్వీట్‌ చేశారు.

క్రేజీ మల్టీస్టారర్‌ మూవీగా రూపొందుతున్న ‘మీట్‌ క్యూట్’లో మహిళా పాత్రధారులు ఎక్కువగా ఉండనున్నారు. అలాగే ఓ ప్రముఖ నటి ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించనున్నారు.

వసంతకుమార్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు విజయ్‌ బుల్గనిన్‌ సంగీతం అందిస్తున్నారు. అవినాష్‌ కొల్ల ఆర్ట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేస్తున్నారు. గ్యారీ బీహెచ్‌ ఎడిటింగ్‌ బాధ్యతలను స్వీకరించారు. ఈ సినిమాలో నటించనున్న ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రయూనిట్‌ అతి త్వరలో అధికారికంగా ప్రకటించనుంది.

సాంకేతిక వర్గం:
సమర్పణ: నాని
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
రచన, దర్శకత్వం: దీప్తి ఘంట
బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా
డి ఓ పి: వసంత్ కుమార్
సంగీతం: విజయ్ బుల్గనిన్
ఆర్ట్: అవినాష్ కొల్ల
ఎడిటర్: గ్యారీ బీహెచ్
లిరిక్స్: కేకే
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here