ఇటీవల సుల్తాన్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన యాంగ్రీ హీరో కార్తి ఈ సారి `సర్ధార్`గా మన ముందుకు రాబోతున్నారు. విశాల్‘అభిమన్యుడు’, శివ కార్తికేయన్ ‘హీరో’ సినిమాలతో తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన టాలెంటెడ్ డైరెక్టర్ పి.ఎస్. మిత్రన్ `సర్ధార్` చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, రాజీషా విజయన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా `సర్ధార్` మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు మోషన్ పోస్టర్ ని విడుదలచేసింది చిత్ర యూనిట్. ఇందులో కార్తి సరికొత్త అవతారంలో కనిపించి ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేశారు. ఒత్తైన జుట్టు, గుబురు గెడ్డంతో ఓల్డ్ గెటప్‌లో ఉన్న ఈ స్టన్నింగ్ ఫస్ట్‌లుక్‌తో సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు మేకర్స్. విభిన్న కథా చిత్రాలని కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మిత్రన్ ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులని అలరించనున్నాడని పోస్టర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎడిటర్‌గా రూబెన్, ఫైట్ మాస్టర్‌గా దిలీప్ సుబ్బరాయన్, వర్క్ చేస్తున్న ఈ సినిమాకి యుగభారతి సాహిత్యం అందిస్తున్నారు.



