పోలీస్ బిడ్డగా వారందరికీ చేతులెత్తి సెల్యూట్ చేస్తున్నాను : మెగాస్టార్

0
1812
Megastar Salutes to Police department

ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో దేశాన్ని కొన్నివారాల పాటు లాకౌట్ ప్రకటించడంతో ఎక్కడి ప్రజలు అక్కడే పూర్తిగా తమ తమ ఇళ్లకు పరిమితం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ లాకౌట్ సమయంలో ప్రజల ఆరోగ్య రక్షణ కోసం రేయింబవళ్లు ఎంతో శ్రమపడుతున్న రెండు తెలుగు రాష్ట్రాల పోలీసు వారికి, ముఖ్యంగా హైదరాబాద్ లోని పోలీసులు ప్రజల రక్షణ కోసం పడుతున్న కష్టం నిజంగా అమోఘం అని,

ప్రజలందరూ కూడా పోలీసులకు ఎక్కడికక్కడ సహకరించి తమ ఇళ్ల నుండి బయటకు రాకుండా ఉంటే, ఈ మహమ్మారి కరోనాని వీలైనంత త్వరగా మన దేశం నుండి తరిమికొట్టవచ్చని మెగాస్టార్ చిరంజీవి కాసేపటి క్రితం తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక వీడియో బైట్ పోస్ట్ చేసారు. ఒక పోలీసు బిడ్డగా ఇటువంటి విపత్కర సమయంలో మనకు ఎంతో సాయం అందిస్తున్న పోలీసులందరికీ నా సెల్యూట్, జైహింద్ అంటూ తన వీడియోలో తెలిపారు మెగాస్టార్……!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here