ఆ విధంగా హనుమంతునితో మా కుటుంబానికి ఎంతో గొప్ప అనుబంధం ఉంది : పవన్ కళ్యాణ్

0
1579
Pawan kalyan shared about Lord Hanuma

మెగాస్టార్ చిరంజీవి నిన్నటి ఏప్రిల్ 8వ తేదీతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, 1962లో తనకు లాటరీలో హనుమంతుని బొమ్మ ఒకటి వచ్చిందని, అప్పటి నుండి ఆ బొమ్మను తనవద్దే భద్రంగా దాచుకున్నానని అన్నారు మెగాస్టార్. నా కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం హనుమంతుని మాదిరిగా ఉన్నాయని మా నాన్నగారు అనే వారు. ఆ తరువాత ప్రఖ్యాత దర్శకులు బాపు గారు, ఒక సందర్భంలో హనుమంతుని బొమ్మ గీస్తుండగా మీ పోలికలే వచ్చాయని చెప్పారని, ఆ తరువాత తన ఇంట్లో పెట్టుకునేందుకు హనుమంతుని చిత్రం ఒకటి ఆయన చిత్రీకరించి పంపగా, నేను దానిని పాలరాతిపై రీ ప్రొడ్యూస్ చేసుకుని ప్రస్తుతం పూజ గదిలో భద్రంగా ఉంచి పూజిస్తున్నానని ఇటీవల మెగాస్టార్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

అయితే ఆ విషయమై కాసేపటి క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ట్విటర్ ద్వారా స్పందించారు. మా అన్నయ్య చిరంజీవి గారి ద్వారా హనుమంతుడు మా ఇంట కొలువుదీరారు, ఆ తరువాత తమ తండ్రి కూడా శ్రీరామునికి అపరభక్తునిగా మారిపోయారని, అలానే తాను కూడా అప్పట్లో యుక్త వయసులో ఉన్నపుడు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసేవాడినని అప్పటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ అన్నయ్య మెగాస్టార్ ట్వీట్ ని రీట్వీట్ చేసారు పవన్…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here