అందమైన విజువల్స్ తో ‘అల వైకుంఠపురములో’ ‘బుట్ట బొమ్మ’ వీడియో సాంగ్ ప్రోమో…..!!

0
1185

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కతున్న లేటెస్ట్ మూవీ ‘అల వైకుంఠపురములో‘. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుండగా, ఒక కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ టబు నటిస్తున్నారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా సాంగ్స్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకులతో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ముఖ్యంగా సాంగ్స్ అయితే యూట్యూబ్ లో పెద్ద చార్ట్ బస్టర్ గా నిలిచి యూత్, మాస్ ఆడియన్స్ ని మరింత అలరించాయి. నేడు ఈ సినిమాలోని ‘బుట్ట బొమ్మ’ వీడియో సాంగ్ ప్రోమో టీజర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. యువ సింగర్ అర్మాన్ మాలిక్ ఆలపించిన ఈ సాంగ్ ని రామజోగయ్య శాస్త్రి రచించగా, సంగీత దర్శకుడు థమన్, మంచి మెలోడియస్ ట్యూన్ ని అందించారు.

ఇక ఈ ‘బుట్ట బొమ్మ’ వీడియో సాంగ్ ప్రోమో టీజర్ లో బన్నీ, పూజ హెగ్డే ఇద్దరూ కూడా లేటెస్ట్ మోడరన్ స్టైల్ అవుట్ఫిట్స్ తో అదరగొట్టగా, సాంగ్ అందమైన విజువల్స్ తో పాటు బన్నీ ట్రెండీ స్టెప్స్ ఈ సాంగ్ కి మరింత జోష్ ని తీసుకువచ్చాయి. ప్రస్తుతం ఈ సాంగ్ వీడియో ప్రోమో, యూట్యూబ్ లో మంచి వ్యూస్, లైక్స్ తో దూసుకుపోతోంది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈనెల 12న రిలీజ్ కానుంది….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here