విలక్షణ దర్శకుడు రవిబాబు మరో డిఫరెంట్ హారర్ కాన్సెప్ట్ తో రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త పాయింట్ తో థ్రిల్ చేసే రవి బాబు ఈ సారి ‘ఆవిరి‘తో భయపెట్టడానికి రెడీ అయ్యాడు. ఆవిరి సినిమాకు సంబంధించిన టీజర్ – ట్రైలర్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇక సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసిన ఆడియెన్స్ కి చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది.
సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకున్న ఆవిరి సినిమా నవంబర్ 1న రిలీజ్ కాబోతోంది. సినిమాకు సెన్సార్ సభ్యులు కట్ లేకుండా యూ/ఏ సర్టిఫికేట్ ని జారీ చేశారు. రవిబాబు కెరీర్ లొనే ఇదొక డిఫరెంట్ ఫిలిం గా రూపొందింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సినిమాను తన బ్యానర్ లో రిలీజ్ చేస్తున్నారు.


