రజినీకాంత్ ‘దర్బార్’ ఫైనల్ స్టెప్

0
776

సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్ సినిమాపై కోలీవుడ్ జనాల్లో అంచనాల డోస్ మాములుగా లేదు. చాలా కాలం తరువాత తలైవా పోలీస్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. 28 ఏళ్ల అనంతరం ఒక డిఫరెంట్ కాప్ గా కనిపించబోతున్నాడు. మురగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో కొనసాగుతోంది.

మొన్నటివరకు జైపూర్ లో నయనతారతో కలిసి షూటింగ్ లో పాల్గొన్న రజినీ ఇప్పుడు ముంబైలో భారీ సెట్స్ మధ్య తెరకెక్కించనున్న యాక్షన్ సీక్వెన్స్ లో నటించడానికి సిద్దమవుతున్నాడు. సినిమాలో ఇదే ఫైనల్ షెడ్యూల్ అని తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ షెడ్యూల్ ని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఫినిష్ చేయాలనీ రజినీకాంత్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక సినిమాను పొంగల్ కానుకగా రిలీజ్ చెయ్యడానికి నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారు. .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here