కాబిల్ వంటి సినిమాతో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద తన క్రేజ్ ను పెంచుకున్న దర్శకుడు సంజయ్ గుప్తా ఇప్పుడు మరో డిఫరెంట్ ప్రాజెక్ట్ తో రెడీ అవుతున్నాడు. గ్యాంగ్ స్టర్ కాన్సెప్ట్ లో భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ముంబై సగ’. ఇమ్రాన్ హష్మీ – జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ యాక్షన్ మూవీ రిలీజ్ డేట్ పై వస్తోన్న రూమర్స్ కి చిత్ర యూనిట్ ఎట్టకేలకు చెక్ పెట్టింది.
2020 జూన్ 19న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్నట్లు టి సిరీస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 1980-90 ల కాలంలో జరిగే ఈ సినిమా హెవీ మాఫియా యాక్షన్ మోడ్ సీన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది. సినిమాలో జాకీ ష్రాఫ్ – సునీల్ శెట్టి – రోహిత్ రాయ్ – ప్రతిక్ – గుల్షన్ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. భూషణ్ కుమార్ – కృషన్ కుమార్ సినిమాను సంయుక్తంగా ముంబై సగ సినిమాను నిర్మిస్తున్నారు.


