యువ నటుడు సందీప్ కిషన్ హీరోగా హర్రర్ జానర్ లో మంచి థ్రిల్లింగ్ కథగా రూపొందుతున్న కొత్త చిత్రం నిను వీడని నీడను నేనే. విస్తా డ్రీమ్ మర్చంట్స్తో కలిసి సందీప్ కిషన్ సొంత నిర్మాణ సంస్థ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ప్రొడక్షన్స్, వి స్టూడియోస్ బ్యానర్లపై దయా పన్నెం, విజి సుబ్రహ్మణ్యన్, సందీప్ కిషన్ నిర్మాతలుగా, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత అనిల్ సుంకర సమర్పిస్తున్న ఈ చిత్రంలో సందీప్ సరసన అన్యా సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.
కొద్దిరోజుల క్రితం ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడు థమన్ ఆధ్వర్యంలో నటుడు సిద్దార్ధ ఆలపించిన ఎక్స్ క్యూజ్ మీ రాక్షసి పాటను యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకర్షిస్తూ మిలియన్ వ్యూస్ తో దూసుకెళుతోంది. పోసాని, మురళీ శర్మ, పూర్ణిమ భాగ్యరాజ్, ప్రగతి, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తుండగా, కెమెరా : పికె వర్మ, ఎడిటింగ్ : ప్రవీణ్ కెఎల్, సంగీతం : ఎస్ఎస్ థమన్, ఆర్ట్ : విదేష్, స్టంట్స్ : వెంకట్. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని జులై 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…..!!


