ప్రస్తుతం టాలీవుడ్‌లో హారర్ చిత్రాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇలాంటి తరుణంలో ఏకా ఆర్ట్ ప్రొడక్షన్ ప్రై.లి. బ్యానర్‌పై వి.అశ్విని కుమార్ దర్శకత్వంలో శ్వేతా సింగ్ నిర్మిస్తోన్న సైంటిఫిక్ హారర్ థ్రిల్లర్ ‘జెస్సీ’.అతుల్ కులకర్ణి, కబీర్ దుహన్ సింగ్, అర్చనా శాస్త్రి, ఆషిమా నర్వాల్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా మార్చి 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం(మార్చి11) రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో….
దర్శకుడు వి.అశ్విని కుమార్ మాట్లాడుతూ – ”ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కి ఆడియెన్స్ నుండి రెస్పాన్స్ చాలా బాగుంది. సినిమా అవుట్‌ఫుట్ పట్ల చాలా ధీమాగా ఉన్నాం. మార్చి15న పి.వి.ఆర్ సినిమాస్ ద్వారా ‘జెస్సీ’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం తప్పకుండా చూసి ఆదరించగలరు” అన్నారు.
నిర్మాత శ్వేతా సింగ్ మాట్లాడుతూ – ”గత రెండు సంవత్సరాలుగా నేను, మా టీమ్ అందరం ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేశాము. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 15న విడుదలకానుండడం చాలా హ్యాపీగా ఉంది, మీ అందరి సపోర్ట్ కావలి. ప్రతి ఒక్కరూ సినిమా చూసి మమ్ముల్ని ఆశీర్వదించగలరు” అన్నారు.
హీరోయిన్ అషిమా నర్వాల్ మాట్లాడుతూ – ” ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టి దాదాపు రెండు సంవత్సరాలు అయ్యింది. ప్రతి ఒక్కరిలో చాలా మార్పు వచ్చింది. ‘జస్సీి’ నాకు చాలా స్పెషల్ మూవీ ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా హార్డ్‌వర్క్ చేశారు. సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అని నమ్మకం ఉంది. తప్పకుండా అందరూ సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి” అన్నారు.
హీరోయిన్ శ్రీతా చందన మాట్లాడుతూ – ”సినిమా విడుదల పట్ల చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాము. ఈ రోజుకోసమే మూడు సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నాం. సినిమా తప్పకుండా చూడండి” అన్నారు.
నటుడు అభినవ్ గోమాటం మాట్లాడుతూ – ”ఈ సినిమా స్టోరీ మొత్తం ఈ’ జెస్సీ ‘అనే క్యారెక్టర్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఇదొక సైంటిఫిక్ సైకాలాజికల్ థ్రిల్లర్. ‘ఈ నగరానికి ఏమైంది’ తరువాత నేను ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ ప్లే చేశాను. అశ్విన్ ఈ సినిమా స్టోరీ నాకు మూడు సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. నిర్మాతగా శ్వేతా గారు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ , టక్నీిషియన్స్‌కి ఎంతో సపోర్ట్ అందించారు. ఆవిడ సపోర్ట్ మరువలేనిది. మార్చి 15న సినిమా విడుదలఅవుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ చూసి ఆదరించగలరు”అన్నారు.
నటుడు విమల్ కృష్ణ మాట్లాడుతూ – ” ఈ సినిమా స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు అయినా మాలో కాన్ఫిడెన్స్ పెరుగుతూ వస్తుంది తప్ప తగ్గలేదు. ఈ మద్యే మా సోదరి ఈ సినిమా చూసి నన్ను చాలా అప్ప్రీషియేట్ చేసింది. ఈ జోనర్‌లో తెలుగులో ఇంతవరకు ఇలాంటి సినిమా రాలేదు. మీ అందరికి ఈ సినిమా ద్వారా చాలా మంచి పేరు వస్తుంది అని చెప్పడం ఆనందంగా అనిపించి ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్‌తో పాటు మంచి ఎమోషన్ కూడా ఉంటుంది”అన్నారు.
చిత్రా మాడిగిల్ మాట్లాడుతూ – ” ఈ సినిమాకు నేను మేకప్ చేయడం జరిగింది. రియల్‌గా వెరీ స్పెషల్ మేకప్. ఈ జోనర్‌లో ఒక సినిమాకు పని చేయడం నాకెంతో స్పెషల్ ” అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ – ” ట్రైలర్‌ను మీ అందరూ చూసి ఎంతో సపోర్ట్ చేశారు. ఇలాంటి ఒక సైకాలాజికల్ సినిమాకి మ్యూజిక్ చేయడం సంతోషంగా ఉంది, ప్రతి ట్యూన్ ఎంజాయ్ చేస్తూ చేశాను. ‘మన వెనకాల ఎవ్వరు లేరని తెలిసి కూడా… మనల్ని ఎవరో పట్టుకుంటే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. ఈ సినిమాలో అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి. సినిమా తప్పకుండా చూడండి” అన్నారు.
అతుల్ కులకర్ణి, కబీర్ దుహన్ సింగ్, అర్చనా శాస్త్రి, ఆషిమా నర్వాల్, శ్రీతా చందనా.ఎన్, విమల్‌కృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్ట్రిల్స్: కృష్ణ, పబ్లిసిటీ డిజైనర్స్: అనిల్ భాను, విఎఫ్‌ఎక్స్: వెంకట్.కె, మేకప్: చిత్రా మోద్గిల్, సౌండ్ డిజైన్, మిక్సింగ్: విష్ణు పి.సి, అరుణ్.ఎస్, క్యాస్టూమ్ డిజైనర్: అశ్వంత్, మాటలు, పాటలు: కిట్టు విస్సాప్రగడ, కొరియోగ్రాఫర్: ఉదయ్‌భాను(యుడి), ఆర్ట్: కిరణ్ కుమార్.ఎం, ఎడిటర్: గ్యారీ బి.హెచ్, మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ: సునీల్‌కుమార్.ఎన్, ప్రొడ్యూసర్: శ్వేతా సింగ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశ్వినికుమార్.వి
http://industryhit.com/t/2019/03/jessie-trailer-launch-pics/


