డెఫినెట్‌గా సోషల్‌ మీడియానే నాకు పూర్తి పాపులారిటీ తీసుకువచ్చింది – హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్

0
495

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ నటించిన ‘ఒరు ఆడార్‌ లవ్‌ ‘ చిత్రం తెలుగులో ‘లవర్స్‌ డే’ పేరుతో విడుదలకు సిద్ధమైంది. మలయాళంలో క్రేజీ డైరెక్టర్‌ ఒమర్‌లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మాతలు ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి సుఖీభవ సినిమాస్‌ బ్యానర్‌పై ప్రేమికుల దినోత్సవం అయిన ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ఇంటర్వ్యూ…

వింక్ గర్ల్ స్టార్‌ టాగ్‌ని ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారు?
– వింక్ గర్ల్ టాగ్‌ డెఫినెట్‌గా కెరీర్‌కి చాలా ఉపయోగపడింది. ఆడియన్స్‌లో నా పేరు ముద్రపడిపోయింది. అలాగే పాపులారిటీ కూడా పెరిగింది. ఒక నటిగా చాలా విషయాలను సాధించాలనుకుంటున్నాను. నటిగా నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవాలి. పర్టికులర్‌గా ఉన్న ట్యాగ్స్‌ను దాటి ఎదగాలనుకుంటన్నాను. అంతే తప్ప ఒత్తిడిగా భావించడం లేదు. ఈ సినిమాలో కన్నుగీటే సీన్‌ వన్‌ టేక్‌లో చేశాను అంతే తప్ప ప్రత్యేకంగా ఎలాంటి ప్రాక్టీస్‌ చేయలేదు.

ఒకే సారి ఇంతపాపులారిటీ రావడంతో మీపేరెంట్స్‌ ఎలా ఫీల్‌ అయ్యారు?
– నేను ఎలా ఈ పాపులారిటీతో షాక్‌కిగురి అయ్యానో ..పేరెంట్స్‌ కూడా అలానే ఫీల్‌ అయ్యారు. వారికి ఇది వారికి ఒక సంకటపరిస్థితిని తీసుకువచ్చింది. నేను కాలేజీకి వెళ్లడం కూడా వారిని భయబ్రాంతులకు గురి చేసింది. అందుకే కొద్దీ రోజులు నన్ను హౌస్‌ అరెస్ట్‌ చేసారు మా పేరెంట్స్‌. ఆ సమయంలో చాలా మంది మీడియా వారు ఇంటర్వ్యూ కోసం మా ఇంటికి వచ్చేవారు. చాలా సార్లు నాకాలేజీ యూనిఫామ్‌లోనే ఇంటర్వూస్‌ ఇచ్చిన సందర్భాలున్నాయి. కొన్ని సార్లు మా పేరెంట్స్‌ నన్ను ఇంట్లో ఉంచి నేను హాస్టల్‌లో ఉంటాను అని చెప్పిన రోజులు ఉన్నాయి.

సోషల్‌ మీడియా మీకు బజ్‌ తీసుకువచ్చింది అని భావిస్తున్నారా?
– ఎలా అయితే కత్తికి రెండు వైపులా పదును ఉంటుందో సోషల్‌ మీడియాలో కూడా పాజిటివ్‌, నెగటివ్‌ఉంటుంది. కానీ నా విషయంలో డెఫినెట్‌గా సోషల్‌ మీడియానే నాకు పూర్తి పాజిటివ్‌ పాపులారిటీ తీసుకువచ్చింది. ‘ఒరు ఆడార్‌ లవ్‌’మలయాళం రీజనల్‌ మూవీ..అందులో ఓకే పాట ఇంత క్రేజ్‌ సంపాదించుకోవడం అనేది కేవలం సోషల్‌ మీడియా వల్లనే సాధ్యపడింది.

ఈ పాపులారిటీ వాళ్ళ ఏమైనా ఆఫర్స్‌ పెరిగాయా?
నాకు డిఫరెంట్‌ ఇండస్ట్రీలనుండి చాలా ఆఫర్స్‌ వచ్చాయి. అందులో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుండి కూడా ఆఫర్స్‌ వచ్చాయి. కానీ అప్పటి వరకూమేము సినిమాలో ఒక్క పాటనే షూట్‌ చేయడంజరిగింది. మిగతా సినిమా అంత షూటింగ్‌కి బాలన్స్‌ ఉండడంతో ఇతర ప్రాజెక్ట్స్‌లో నటించడం కుదరలేదు. అంతేకానీ రెమ్యూనరేషన్‌ విషయంలో విభేదాలు వచ్చాయి అనేది పూర్తిగా అవాస్తవం.

స్క్రిప్ట్‌ని మీరే ఫైనలైజ్‌ చేస్తారా ?
– స్టోరీస్‌ నేనే వింటాను. నా పాత్రకు నటన పరంగా మంచి స్కోప్‌ ఉందని అనిపిస్తే మా నాన్న గారితో చెప్పి ఫైనలైజ్‌ చేస్తాను.

‘ఒరు ఆడార్‌’ సినిమాకు అంత పాపులారిటీ రావడంతో కొన్ని సాంగ్స్‌ యాడ్‌ చేసారని విన్నాం?
అలాంటిదేమి లేదండి అన్ని పాటలు స్కిప్ట్‌లో ముందే సెట్‌ చేసుకొని ఉన్నాం. అంతే కానీ తరువాత కూడా స్క్రిప్ట్‌ పరంగానే వెళ్ళాం తప్ప పాపులారిటీ తరువాత ఎలాంటి సాంగ్స్‌ యాడ్‌ చేేయలేదు. ఒరు ఆడార్‌ లవ్‌ సినిమా తెలుగులో ‘లవర్స్‌ డే’గా నాలుగు దక్షిణాది భాషల్లో ఒకేసారి ఫిబ్రవరి 14న విడుదలవుతోంది. సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాలో ఆరు పాటలున్నాయి. అందరం కొత్తవాళ్లే. మా బెస్ట్‌ ఔట్‌పుట్‌ ఇచ్చాం. ఎంటర్‌టైనింగ్‌గా ఉండే సినిమా. స్కూల్‌ లైఫ్‌లో జీవితం గురించి చెప్పే సినిమా ఇది. సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది.

రణవీర్‌తో ‘సింబ’ సినిమాలో అవకాశం వచ్చింది అని విన్నాం?
– ‘సింబ’ సినిమాలో నాకు అవకాశం వచ్చింది అని రూమర్‌ నేను కూడా విన్నాను. కానీ పర్సనల్‌గా నాకు ఎలాంటి ఆఫర్‌ రాలేదు

రీసెంట్‌గా మీరు నటించిన ‘శ్రీదేవిబంగా’్ల మూవీ టీజర్‌ కాంట్రవర్సీ అయ్యింది కదా?
– నేను పర్సనల్‌గా ఎలాంటి నోటీసు అందుకోలేదు. కాని… నేను నటించే మూవీస్‌ కాంట్రవర్సీ అవ్వాలని అస్సలు కోరుకోను కాకపోతే..పబ్లిసిటీకోసమే ఇదంతా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. నేను ఆ సినిమాలో డైరెక్టర్‌ గారు చెప్పినట్టే నటించాను తప్ప ఎలాంటి నెగటివిటీ స్ప్రెడ్‌ చేయలేదు. ఆ సినిమాలో ఉన్న సిమిలారిటీ అంశాలు ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేసిందే తప్ప అదంతా డైరెక్టర్స్‌ క్రియేట్‌ చేసిన ఇమాజినేషన్‌. ఒకవేళ మీరన్నట్లు ఏదైనా సమస్య ఉంటే డైరెక్టర్‌, నిర్మాతలకు సంబంధించింది. నావరకు నా పాత్రను నేను ఎలా చేశాననే చూసుకుంటాను. టైటిల్‌, టీజర్‌లో ఉన్న ఎలిమెంట్స్‌, డైరెక్టర్‌ క్రియేటివిటీ కారణంగా శ్రీదేవిగారి సినిమా అనే వార్తలు వచ్చాయి. సినిమా చూస్తే కానీ అసలు విషయం తెలియదు కదా. స్క్రిప్ట్‌ విన్నప్పుడు చాలా బాగా అనిపించింది. లేడీ ఓరియెంటెడ్‌ సినిమా కాబట్టి ఆ సినిమాను ఒప్పుకున్నాను.

సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు?
– నేను మలయాళీ అమ్మాయి అయినా నాకు నార్త్‌ ఇండియా, హైదరాబాద్‌ ఇలా చాలా ప్రాంతాల్లో అభిమానులున్నారు. అలాంటి సందర్బాల్లో నా అభిమానులను, ఫాలోవర్స్‌ను కలుసుకునేలా చేసిది సోషల్‌ మీడియానే. అదీగాక నా సోషల్‌ మీడియా అకౌంట్‌ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకుంటాను. కాబట్టి వాటిలో ఫోటోలు, వీడియోస్‌, మెసేజ్‌లు పోస్ట్‌ చేస్తుంటాను.

లవర్స్‌ డే సినిమా ప్రి రిలీజ్‌ ఫంక్షన్‌కి గెస్ట్‌గా అల్లు అర్జున్‌ రావడం ఎలా ఫీల్‌ అవుతున్నారు?
– అల్లు అర్జున్‌ చాలా పెద్ద స్టార్‌. ఆయన మా సినిమా ఆడియో లాంచ్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మా వీడియోస్‌ చూసి అభినందించారు. ఆయన కొడుకు చేసిన గన్‌ షాట్‌ సీన్‌ నేను కూడా చూసి చాలా ఎంజాయ్‌ చేశాను. ఆయన్ను నేరుగా కలుసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

మీ నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌?
– నా తదుపరి చిత్రాల గురించి ఇప్పుడే చెప్పలేను. ప్రస్తుతం శ్రీదేవి బంగ్లాలో నటిస్తున్నాను. ఇతర భాషా చిత్రాల్లో కూడా నటిస్తున్నాను. త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాం…అంటూ ఇంటర్వ్యూ ముగించారు…

http://industryhit.com/t/2019/01/priya-prakash-varrier-pics/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here