జూన్ 27న రాబోతోన్న ‘కన్నప్ప’ను ఆశీర్వదించండి.. గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో డా. మోహన్ బాబు
‘కన్నప్ప’ కథను మరోసారి చెప్పరా అని శివుడు నన్ను ఎన్నుకున్నాడని నేను భావిస్తున్నా – గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో విష్ణు మంచు
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ విడుదలకు సిద్ధమవుతోంది. డాక్టర్ ఎం. మోహన్ బాబుతో పాటుగా ఈ చిత్రంలో విష్ణు మంచు, ప్రీతి ముకుందన్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, ముఖేష్ రిషి, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రల్లో నటించారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై డా. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. జూన్ 27వ తేదీన ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన టీమ్ జూన్ 7న గుంటూరులో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో..
డా. మోహన్ బాబు మాట్లాడుతూ .. ‘మా అమ్మకి పుట్టుకతో రెండు చెవులు వినిపించేవి కావు. అందరూ నా వాయిస్‌ని మెచ్చుకుంటుంటే ఆ మాటలు మా తల్లికి వినిపిస్తే ఎంత బాగుండేది అనుకునేవాడిని. జీవితంలో భయం అనేది ఉండకూడదు, తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడకూడదు, మా విద్యాలయాల్లో విద్యార్థులకు అదే నేర్పిస్తున్నాను. కన్నప్ప సినిమాని ఆ పరమేశ్వరుడు ఆశీర్వదించాడు. దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు కష్టపడి ఈ సినిమా తీశాము. నా బిడ్డ ఎంత కష్టపడ్డాడు.. ఎలా ఈ సినిమా తీసాడు అనేది నేను చెప్పదలచుకోలేదు. సినిమానే మాట్లాడుతుంది. నా కంటే చిన్నవాడు, నా భావ ప్రభాస్ కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేమిద్దరం బావా బావా అని పిలుచుకుంటాం. మా మధ్య ఎన్నో ఏళ్ళ అనుబంధం ఉంది. మానవత్వం, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్. ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ గా ఉన్న టాప్ హీరోలలో ప్రభాస్ ఒకడు. సినిమాలో నటించాలని కోరిన వెంటనే ఓకే చెప్పారు. ఆయన వందేళ్లు క్షేమంగా ఉండాలి. మోహన్ లాల్ వర్సటైల్ యాక్టర్. భారతం గర్వించదగ్గ నటుడు. ఈ మధ్యనే మలయాళంలో ఆయన నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కన్నప్పలో చేయమని అడిగిన వెంటనే చేస్తానని అన్నారు. శరత్ కుమార్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం.. ఇలా అందరినీ ఆ భగవంతుడే ఈ సినిమాలోకి రప్పించాడు. ప్రభుదేవా డ్యాన్స్ మాస్టర్‌గా ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నారు. ఎన్నో సినిమాల్లో నాకు డ్యాన్స్ అంటే ఏంటో నేర్పించారు. జూన్ 27న రాబోతోన్న ‘కన్నప్ప’ను ఆశీర్వదించండి’ అని అన్నారు.
విష్ణు మంచు మాట్లాడుతూ .. ‘కన్నప్ప ఫస్ట్ రోడ్ షో గుంటూరులోనే జరిగింది. మాకు మెమరబుల్ గా నిలిచిపోయింది. ఈ సినిమా తీయడానికి, నేను ఇక్కడ నిలబడటానికి చాలామంది సాయం చేసారు. నాకు మా నాన్న దేవుడు.. ఆయన లేకపోతే నేను లేను. అందుకే మా నాన్నకి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నిన్నటి వరకూ కూడా బ్రహ్మానందం గారు ఈ సినిమా విషయంలో ధైర్యం చెబుతూనే ఉన్నారు. నాకు ఫోన్ చేసి సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది.. ధైర్యంగా ఉండమని ప్రతీ నిమిషం చెబుతూ వచ్చారు. ప్రభుదేవా ఒక కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, డైరెక్టర్‌గా సక్సెస్ చూసారు. ఆయన పనులన్నీ మానుకొని కన్నప్ప సినిమాకి మూడు పాటలు చేయాల్సిన అవసరం లేదు. అయినా మా కోసం చేశారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు. ముఖేష్ రిషి, శివ బాలాజీ, రఘుబాబు.. ప్రతీ ఒక్కరికి పేరు పేరునా థ్యాంక్స్. డైరెక్టర్ ముఖేష్ సింగ్ భాష రాకపోయినా ‘కన్నప్ప’ సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకున్నారు. సినిమా ఎప్పుడు చేస్తామో తెలియకుండానే 2017లోనే ఈ ప్రాజెక్ట్ చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్ ఒప్పుకున్నారు. ఇది శివాజ్ఞ. ఎవరెవరు ఈ సినిమాలో పనిచేయాలి అనేది శివాజ్ఞతోనే జరిగింది. నా మిత్రుడు ప్రభాస్‌కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. అతను కన్నప్ప సినిమా చేయడానికి కారణం.. నాన్న మీద ఆయనకు ఉన్న ప్రేమ, గౌరవం. నాన్న కోసం ప్రభాస్ ఈ సినిమా చేసారు కానీ, నాకోసం చేయలేదు. అతనికి ఈ క్యారక్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కాలంలోనూ పెద్దల పట్ల గౌరవం, స్నేహానికి విలువ ఉందనడానికి ప్రభాస్ ఒక ఉదాహరణ. మీరందరూ అతని స్టార్ డమ్‌ని కాదు, అతని వ్యక్తిత్వాన్ని ప్రేమించండి. మోహన్ లాల్ ఒక మహా నటుడు. జీవితంలో ఒక సందర్భంలో మనందరికీ దేవుడు నిజంగానే ఉన్నాడా అనే డౌట్ ఉంటుంది. అక్కడి నుంచే భక్తి పుడుతుంది. దేవుడికి దాసోహం అవుతాం. కన్నప్ప సినిమా కూడా అంతే. ఈ ప్రయాణం ఒక వ్యక్తిగా నన్ను చాలా మార్చింది. దాదాపు 50 ఏళ్ళ తర్వాత కన్నప్ప కథను చిత్రీకరించాం. యాభై ఏళ్ల తర్వాత కన్నప్ప కథను మరోసారి చెప్పరా అని శివుడు నన్ను ఎన్నుకున్నాడని నేను భావిస్తున్నా. కన్నప్పను ఎన్నో సంవత్సరాలుగా ఒక బిడ్డగా చూసుకున్నాం. జూన్ 27న మీ ముందుకు తీసుకొస్తున్నాం. అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.
బ్రహ్మానందం మాట్లాడుతూ .. ‘‘కన్నప్ప’ చిత్రంలో విష్ణు బాబు అద్భుతంగా ఉన్నారు. ప్రతీ విషయాన్ని ఆయన మానిటర్లో చూసుకునే వారు. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నిర్మాతగా మోహన్ బాబు పేరు ఉంటుంది.. కానీ నిర్మాతగా, హీరోగా విష్ణు చాలా కష్టపడ్డారు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, శరత్ కుమార్ వంటి వారు అద్భుతంగా నటించారు. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
రఘు బాబు మాట్లాడుతూ .. ‘కన్నప్ప సినిమా ఒక రేంజ్. ఈ సినిమాను కనువిందు చేసేలా న్యూజిలాండ్ లో తీశారు. అబ్బురపరిచే లొకేషన్స్ లో తీశారు. కామెడీ, యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్ అన్నీ కలిసి ఉండే భక్తి సినిమా కన్నప్ప. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ షూటింగ్ లో బాగా ఎంజాయ్ చేశాం. సినిమా చూశాక మీరు కూడా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.
శివ బాలాజీ మాట్లాడుతూ .. ‘ఈ కన్నప్ప సినిమా తరతరాలు నిలిచి ఉంటుంది. మనం కలియుగంలో ఉన్నాం. కొందరు ఇన్ఫ్లుయన్సర్స్ నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. దేవుణ్ణి ఒక్కటే కోరుకుంటున్నా.. అలా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేసే వారిని భస్మం చేసే శక్తి మాకివ్వండి’ అన్నారు.
బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ మాట్లాడుతూ .. ‘కన్నప్ప సినిమాలో మని క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఇది నాకో అద్భుత అవకాశం. ఈ అద్భుతమైన క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు విష్ణు గారికి, మోహన్ బాబు గారికి ధన్యవాదాలు. న్యూజిలాండ్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో మోహన్ బాబు గారు యూనిట్ అందరినీ కంటికి రెప్పలా చూసుకున్నారు. మమ్మల్ని అందరినీ కన్నబిడ్డల్లా చూసుకున్నారు మోహన్ బాబు గారు. ఇప్పటికి 3 – 4 కన్నప్ప సినిమాలు వచ్చాయి కానీ ఈ కన్నప్ప సినిమా యూత్ అందరికీ అవసరమయ్యే సినిమా. అందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి’ అన్నారు.