లిటిల్ హార్ట్స్ టీజర్ రిలీజ్ ఈవెంట్

0
6

టీనేజ్ లైఫ్ లోని ఫన్నీ ఇన్సిడెంట్స్ ను “లిటిల్ హార్ట్స్” మూవీలో లైవ్ లీగా చూపించారు – టీజర్ రిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి

“90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ మౌళి తనుజ్, “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ “లిటిల్ హార్ట్స్”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. “90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ “లిటిల్ హార్ట్స్” మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కంటెంట్ నచ్చి నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సెప్టెంబర్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ రోజు ఈ చిత్ర టీజర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో

ఈటీవీ విన్ నుంచి నితిన్ మాట్లాడుతూ – అనగనగా, ఎయిర్, కనకమహాలక్ష్మి హ్యాట్రిక్ సక్సెస్ తర్వాత ఈటీవీ విన్ నుంచి వస్తున్న చిత్రమిది. థియేటర్స్ లో మీరు ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. థియేటర్స్ లో ఒకసారి చూస్తే మళ్లీ చూడాలని అనుకుంటారు. “లిటిల్ హార్ట్స్”ను థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్న బన్నీవాస్, వంశీ నందిపాటి గారికి థ్యాంక్స్. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి మాట్లాడుతూ – “లిటిల్ హార్ట్స్” టీమ్ అందరికీ బెస్ట్ విశెస్ అందిస్తున్నా. ఒక మంచి మూవీ చేశామనే నమ్మకంతో మేమంతా ఉన్నాం. మా డైరెక్టర్ నేను పాటలు కంపోజిషన్ టైమ్ లో భార్యాభర్తల్లా గొడవలు పడతాం. మళ్లీ కలిసిపోతాం. సాయి మార్తాండ్ నాకు బెస్ట్ ఫ్రెండ్. ఈ సినిమాను థియేటర్స్ లో చూసి ఆదరించండి. అన్నారు.

డైరెక్టర్ సాయి మార్తాండ్ మాట్లాడుతూ – ఈ రోజు “లిటిల్ హార్ట్స్” సినిమా ఈవెంట్ కోసం ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్ తో మాట్లాడాను. అతను యూఎస్ లో తన నెక్ట్స్ మూవీ కోసం లొకేషన్స్ చూస్తున్నాడు. “లిటిల్ హార్ట్స్” నచ్చకుంటే నా నెక్ట్స్ సినిమాలు చూడకండి అని ఆడియెన్స్ తో చెప్పాలని అనుకుంటున్నా అని ఆదిత్యతో అన్నాను. అతను వెంటనే నవ్వుతూ అలా చెప్పకు అని అన్నాడు. 2గంటల 3 నిమిషాల సినిమా చాలా బాగా వచ్చింది. థియేటర్స్ లో బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి ప్రయత్నం చేశామని నమ్మకంతో మేమంతా ఉన్నాం. అన్నారు.

నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ – “లిటిల్ హార్ట్స్” సినిమాలో నటించేప్పుడు మా డైరెక్టర్ సాయి సెటిల్డ్ గా పర్ ఫార్మ్ చేయండి సార్ అంటూ వెంటపడేవాడు. ఎంత సెటిల్డ్ గా నటించినా, మళ్లీ ఇంకాస్త అనేవాడు. ఈ సినిమా తర్వాత నాకు సెలిల్డ్ స్టార్ అనే బిరుదు వస్తుందేమో చూడాలి. డబ్బింగ్ చెప్పేప్పుడు కూడా సెటిల్డ్ గా చెప్పండి అనేవారు. ఈ సినిమాలో నాకొక కొత్త తరహా క్యారెక్టర్ లో నటించే అవకాశం దక్కింది. థియేటర్స్ లో ఈ సినిమాను తప్పకుండా చూడాలని కోరుతున్నా. ముఖ్యంగా మౌళి తనుజ్ కు ఈ చిత్రంతో చాలా మంచి పేరు వస్తుంది. అన్నారు.

హీరోయిన్ శివానీ నాగరం మాట్లాడుతూ – “లిటిల్ హార్ట్స్” సినిమాలో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. టీజర్ మీకు నచ్చిందని నమ్ముతున్నా. నేను కాత్యాయని అనే క్యారెక్టర్ లో నటించాను. ఇలాంటి పాత్ర చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఆ కోరిక “లిటిల్ హార్ట్స్” చిత్రంతో తీరింది. రాజీవ్ గారి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. “లిటిల్ హార్ట్స్”ను థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్న బన్నీవాస్, వంశీ నందిపాటి గారికి థ్యాంక్స్. మంచి కంటెంట్ ఎక్కడున్నా వాళ్లు సపోర్ట్ చేస్తుంటారు. అన్నారు.

హీరో మౌళి తనూజ్ మాట్లాడుతూ – ఈ రోజు మా మూవీ టీజర్ రిలీజ్ కు వచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి థ్యాంక్స్. దర్శకుడు సాయి మార్తాండ్ “లిటిల్ హార్ట్స్” స్క్రిప్ట్ నా దగ్గరకు తీసుకొచ్చినప్పుడే బాగా నవ్వుకున్నాం. ఇది థియేట్రికల్ గా రిలీజ్ చేసే మూవీ అని ఫిక్స్ అయ్యాం. ఎంటర్ టైనర్ మూవీస్ థియేటర్స్ లోనే చూడాలి. ఓటీటీలో చూస్తే ఆ ఫన్ దొరకదు. మా మూవీ కోసం ప్రతి కాస్ట్ అండ్ క్రూ మెంబర్ కష్టపడి పనిచేశారు. ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు. బాధ్యత లేకుండా అల్లరిగా తిరిగే కొడుకు, అతని తండ్రి మధ్య క్రియేట్ అయ్యే ఫన్ కోసం ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి. అన్నారు.

ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ – మా “లిటిల్ హార్ట్స్” సినిమా టీజర్ లాంఛ్ చేసేందుకు వచ్చిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి థ్యాంక్స్. ఆయన మంచి సినిమాలు చేయడమే కాదు అందరికీ రీచ్ అయ్యోలా ఎలా ప్రమోట్ చేయాలో చేసి చూపించారు. “లిటిల్ హార్ట్స్” సినిమా చూసి మీరంతా థియేటర్స్ లో కడుపునొప్పి పుట్టేలా నవ్వితే వాళ్లకు కడుపునొప్పి తగ్గేందుకు మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తాం. సెప్టెంబర్ 12న మా మూవీని థియేటర్స్ లో తప్పకుండా చూడండి. అన్నారు.

ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ మాట్లాడుతూ – అనిల్ రావిపూడి గారి సినిమాలు చూసి బయటకు హ్యాపీగా వస్తాం. ఆయనలోని పాజిటివ్ ఎనర్జీనే మనందరికీ హ్యాపీనెస్ ఇస్తుంది. అందుకే ఆయనను నా మూవీస్ ప్రమోషన్స్ లో ఎక్కడైనా ఒక దగ్గరైనా వచ్చేలా చూసుకుంటా. అనిల్ గారి సినిమాలన్నీ మనకు స్ట్రెస్ బస్టర్స్. ఆయనను “లిటిల్ హార్ట్స్” టీజర్ కోసం అడిగినప్పుడు తప్పకుండా వస్తానని అన్నారు. ఎంతో బిజీగా ఉన్నా ఆయన మా ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఉంది. “లిటిల్ హార్ట్స్” సినిమాను ఇప్పటికి మూడుసార్లు చూశాను. మిమ్మల్ని థియేటర్స్ లో నవ్వించడంలో ఎక్కడా ఫెయిల్ కాదు. ఇంటర్ చదివిన పిల్లలు ఉన్న ప్రతి పేరెంట్ చూడాల్సిన చిత్రమిది. మీ పిల్లాడు బయట ఏం చేస్తున్నాడో మా మూవీలో చూస్తే తెలిసిపోతుంది. అన్నారు.

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ – టీనేజ్ లో ఉండే సరదా లైఫ్ మనందరికీ దాదాపు ఒకేలా ఉంటుంది. టీనేజ్ బ్యాక్ డ్రాప్ లో మూవీ చాలా బాగుంటుంది కదా అని డిస్కషన్ చేస్తున్న టైమ్ లో “లిటిల్ హార్ట్స్” టీజర్ నా దగ్గరకు వచ్చింది. ఈ టీజర్ లో చూపించినట్లు గల్లీలో కొట్లాటలు, ఇంట్లో పేరెంట్స్ తో చివాట్లు, అమ్మాయి చుట్టూ చక్కర్లు, ఎంసెట్ ఎగ్జామ్ టెన్షన్స్..ఇవన్నీ లైవ్ లీగా అనిపించాయి. టీజర్ నాకు బాగా నచ్చింది. కామెడీ మూవీని థియేటర్స్ లో చూస్తే ఆ వైబ్ అలా అందరికీ రీచ్ అవుతుంది. నా మూవీస్ ద్వారా నేనది ఎక్సిపీరియన్స్ చేశాను. ఈ యంగ్ టీమ్ తమ సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తున్న గట్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఈ టీమ్ అందరినీ మీరు ఎంకరేజ్ చేయండి. “లిటిల్ హార్ట్స్” సినిమా మీ అందరికీ నచ్చుతుంది. బన్నీ వాస్ గారు కొన్ని సీన్స్ చెప్పినప్పుడు బాగున్నాయి అనిపిచింది. లిటిల్ హార్ట్స్ అనేది మంచి టైటిల్, ప్రేమించుకుందాం రా సినిమాలో వెంకటేష్ గారు గుర్తొచ్చారు. అంత కనెక్ట్ అయ్యేలా టైటిల్ ఉంది. “90s మిడిల్ క్లాస్ బయోపిక్” చూసినప్పుడు ఆదిత్య హాసన్ తో మాట్లాడాను. హెల్దీ, టిపికల్ కామెడీ టైమింగ్ తో ఆ సిరీస్ చేశారు. జంధ్యాల గారి స్టైల్ లో మమ్మల్ని ఇన్స్ పైర్ చేసేలా ఆ సిరీస్ రూపొందించాడు. “లిటిల్ హార్ట్స్” లాంటి కంటెంట్ ప్రొడ్యూస్ చేసిన ఆదిత్యకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. డైరెక్టర్ సాయి మార్తాండ్ టేకింగ్, స్టైల్, టైమింగ్ చాలా బాగుంది. ఆయనకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. నీ కష్టం, నీ క్రియేటివిటీనే స్టేట్ మెంట్ గా భావించు. ప్రేక్షకులు తప్పకుండా ఆదరణ చూపిస్తారు. శివానీ బిజీ హీరోయిన్ అవుతోంది. రాజీవ్ గారు ఈ అల్లరి కొడుకును భరించే తండ్రిగా ఆకట్టుకునేలా నటించారు. ఈటీవీ విన్ సాయి, నితిన్ కు నా అభినందనలు, మంచి కంటెంట్ తీసుకొస్తున్నారు. మంచి కంటెంట్ థియేటర్స్ లోకి రావాల్సిన అవసరం ఉంది. మీరు వీలైనన్ని ఎక్కువ మూవీస్ థియేటర్స్ కు తీసుకురావాలని కోరుతున్నా. వంశీ గారికి, బన్నీవాస్ గారికి కంగ్రాట్స్ చెబుతున్నా, వాళ్లు ఈ మూవీతో హిట్ కొట్టినట్లే. అన్నారు.

నటీనటులు – మౌళి తనూజ్, శివానీ నాగరం, రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్, తదితరులు

టెక్నికల్ టీమ్

రచన, దర్శకత్వం – సాయి మార్తండ్
ప్రొడ్యూసర్ – ఆదిత్య హాసన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
మ్యూజిక్ – సింజిత్ యెర్రమల్లి
సినిమాటోగ్రఫీ – సూర్య బాలాజీ
ఎడిటర్ – శ్రీధర్ సొంపల్లి
ఆర్ట్ డైరెక్టర్ – దివ్య పవన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – వినోద్ నాగుల, మురళి పున్న

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here