హోంబాలే ఫిల్మ్స్, రిషబ్ శెట్టి బిగ్గెస్ట్ పాన్-ఇండియా మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి కులశేఖరగా గుల్షన్ దేవయ్య ఫస్ట్ లుక్ రిలీజ్ 

0
10
Gulshan Devaiah as Kulashekara in Kantara Chapter 1
Gulshan Devaiah as Kulashekara in Kantara Chapter 1
హోంబాలే ఫిల్మ్స్, రిషబ్ శెట్టి బిగ్గెస్ట్ పాన్-ఇండియా మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి కులశేఖరగా గుల్షన్ దేవయ్య ఫస్ట్ లుక్ రిలీజ్ 
మోస్ట్ ఎవైటెడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ కాంతార చాప్టర్ 1 నిర్మాతలు బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు. రిషబ్ శెట్టి బాక్‌బస్టర్ కాంతారకు ప్రతిష్టాత్మక ప్రీక్వెల్‌లో కులశేఖర పాత్రలో నటిస్తున్నాడు గుల్షన్ దేవయ్య. ఈ అనౌన్స్ మెంట్ ఫ్రాంచైజీ అభిమానులలో ఉత్సాహాన్ని నింపింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
రిషబ్ శెట్టి రచన, దర్శకత్వం వహించి తానే మళ్లీ సెంట్రల్ క్యారెక్టర్‌గా నటిస్తున్న “కాంతార చాప్టర్ 1” మొదటి పార్ట్‌లో ఉన్న యూనివర్స్‌ని ఇంకా విస్తరించబోతోంది. తొలి సినిమా రా, ఫోక్‌లొర్, ఆధ్యాత్మికత, భావోద్వేగాలతో రూటెడ్ స్టోరీటెల్లింగ్ కి కొత్త నిర్వచనం ఇచ్చింది. ఈ ప్రీక్వెల్ మాత్రం మూలాలను ఇంకా లోతుగా ఎక్స్ప్లోర్ చేస్తూ, మరింత ఇంటెన్సిటీ, భావోద్వేగం జోడించబోతోంది.
ఈ సినిమా విజువల్‌ విజువల్ వండర్ గా ఉండబోతోంది. సినిమాటోగ్రఫీని అర్వింద్ ఎస్. కాశ్యప్ అందిస్తుండగా, ఫస్ట్ పార్ట్ లో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన బి. అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ ఇస్తున్నారు. హోంబాలే ఫిలిమ్స్‌ విజయ్ కిరగందూర్ నెక్స్ట్ లెవల్ లో నిర్మిస్తున్నారు. 
కులశేఖర పాత్రలో గుల్షన్ దేవయ్య ఫస్ట్ లుక్ బయటికి రావడంతో సినిమా మీద మరింత హైప్ పెరిగింది. ఈ మోస్ట్ లవ్డ్ యూనివర్స్ లో అతని రోల్ ఎలాంటి మలుపులు తీసుకొస్తుందో అన్న ఆసక్తి పెరుగుతోంది. 
ఈ చిత్రం కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్ లో అక్టోబర్ 2, 2025న గ్రాండ్ గా వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here