యంగ్ టాలెంటెడ్ హీరో హవీష్ , సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు కాంబో క్రేజీ మూవీ టైటిల్ గ్లింప్స్ ఈ నెల 19న రిలీజ్

0
3
Havish Trinadharao Nakkina Movie
Havish Trinadharao Nakkina Movie

యంగ్ టాలెంటెడ్ హీరో హవీష్ , సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు కాంబో క్రేజీ మూవీ టైటిల్ గ్లింప్స్ ఈ నెల 19న రిలీజ్

నువ్విలా,జీనియస్, రామ్ లీలా, సెవెన్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో హవీష్, సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా, మజాక వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాథరావు కాంబోలో ఓ క్రేజీ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను ఈ నెల 19న రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీకి నిఖిల కోనేరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఓ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా హవీష్, నక్కిన త్రినాథరావు మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తుండగా..నిజార్ షఫీ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.

నటీనటులు – హవీష్, తదితరులు

టెక్నికల్ టీమ్
నిర్మాణం- హార్నిక్స్ ఇండియా ఎల్ ఎల్ పి
ఫైట్స్ – రామకృష్ణ
ఎడిటర్ – ప్రవీణ్ పూడి
డీవోపీ – నిజార్ షఫీ
సంగీతం – మిక్కీ జే మేయర్
స్టోరీ, డైలాగ్స్ – విక్రాంత్ శ్రీనివాస్
మార్కెటింగ్ : క్రేజీ షౌట్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాత – నిఖిల కోనేరు
రచన: దర్శకత్వం – నక్కిన త్రినాథరావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here