లవ్ రెడ్డి మూవీ రివ్యూ

0
40
Rebel Star Prabhas For
Rebel Star Prabhas For "Love Reddy"

లవ్ రెడ్డి మూవీ రివ్యూ

నటీనటులుఅంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి, తదితరులు

టెక్నికల్ టీమ్
సంగీతం – ప్రిన్స్ హేన్రి
ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రవీంద్ర రెడ్డి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్)
సహా నిర్మాతలు – సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవి కిరణ్, జకరియా
నిర్మాతలు- సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి
రచన, దర్శకత్వం: స్మరన్ రెడ్డి

 

లవ్ రెడ్డి కథ:
సినిమా కథ మొత్తం ఆంధ్ర కర్ణాటక సరిహద్దులోని ఒక గ్రామంలో జరుగుతూ ఉంటుంది. గార్మెంట్స్ బిజినెస్ చేసే 30 ఏళ్ల నారాయణరెడ్డి (అంజన్ రామ చంద్ర) పెళ్లి కూడా చేసుకోకుండా తనకు నచ్చే అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. మరో పక్క అతని తమ్ముడు త్వరగా పెళ్లి చేసుకోమని, అప్పుడే తనకు పెళ్లి అవుతుందని పోరు పెడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో బస్సులో దివ్య(శ్రావణి రెడ్డి)ని మొదటి చూపులోనే చూసి ప్రేమలో పడతాడు నారాయణరెడ్డి. అయితే తాను ప్రేమిస్తున్న విషయం దివ్యకు చెప్పడు. దివ్య మాటల ద్వారా ఆమె కూడా తనను ప్రేమిస్తుందని అనుకుంటాడు. అయితే దివ్య ఎంగేజ్మెంట్ చేసుకుందనే విషయం తెలిసి ఆ ఎంగేజ్మెంట్ చేసుకున్న వ్యక్తిని బెదిరించి క్యాన్సిల్ చేయిస్తాడు. ఆ తర్వాత మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమైందనే విషయం తెలిసి తన ప్రేమ విషయాన్ని దివ్యకు చెబుతాడు. అయితే దివ్య ఒక ఊహించని షాక్ ఇస్తుంది. దివ్య ఇచ్చిన షాక్ ఏంటి? అసలు దివ్య నారాయణ రెడ్డిని ప్రేమించిందా? చివరికి నారాయణరెడ్డి, దివ్య కలిశారా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

నటీనటుల ప్రదర్శన
ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే నారాయణరెడ్డి అనే పాత్రలో అంజన్ రామచంద్ర ఒదిగిపోయాడు. ఎలాంటి బాదరబందీ లేని ఒక ఉమ్మడి కుటుంబంలో పెద్ద కొడుకుగా సరిగ్గా నప్పాడు. ఎమోషనల్ సీన్స్ లో నటన చూశాక. ఆయనకు ఇది మొదటి సినిమాలా అనిపించలేదు. హీరోయిన్గా నటించిన శ్రావణి రెడ్డి హీరోయిన్ లా కాకుండా ఆ పాత్ర కోసమే సిద్ధం చేసినట్లు అనిపించింది. కొన్ని చోట్ల మేకప్ లేకుండా కొన్ని చోట్ల మేకప్ తో మన పక్కింటి అమ్మాయిలాగా రోజు మనం బస్సులలోనే లేక రోడ్లమీద చూసే ఒక న్యాచురల్ బ్యూటీలా అనిపించింది. ఆమె నటనతో కూడా ఔరా అనిపించింది. ఇక సినిమాలో నటించిన వారందరూ దాదాపుగా కొత్తవారే అయినా సరే ఎక్కడ వీరు కొత్తవారు అని ఫీలింగ్ కలగదు. ముఖ్యంగా హీరోయిన్ తండ్రి పాత్రలో నటించే వ్యక్తికి నటించడానికి సోప్ ఉన్న పాత్ర దక్కింది. మిగతావాళ్ళు తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతిక అంశాలు
ఈ సినిమాలో టెక్నికల్ టీం విషయానికి వస్తే సినిమా మొత్తానికి బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది. అలాగే పాటలు కూడా చాలా బాగా కుదిరాయి. ఏదో ఇరికించినట్టు కాకుండా చాలా ప్లజెంట్ ఫీలింగ్ కలిగించడంలో మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. అలాగే లొకేషన్స్ కూడా చాలా కొత్తగా అనిపించాయి. మనల్ని ఆ ప్రదేశాలకు తీసుకువెళ్లిపోతున్నట్టుగా సినిమాటోగ్రాఫర్ చేసిన మ్యాజిక్ స్క్రీన్ మీద కనిపించింది. నిడివి కూడా చాలా చక్కగా సరిపెట్టడంలో ఎడిటర్ సక్సెస్ అయ్యాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

విశ్లేషణ:
కథగా చెప్పుకుంటే ఇది కొత్త కథ ఏమీ కాదు, ఒక ప్రేమ కథ. తెలుగు సినిమాల్లో 90 శాతానికి పైగా సినిమాలు లవ్ స్టోరీలు గానే తెరకెక్కుతాయి. ఈ సినిమా కూడా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా మొదలవుతుంది. ఎన్ని పెళ్లి చూపులకు వెళ్లిన పిల్లలు నచ్చకపోవడంతో సరైన అమ్మాయి కోసం ఎదురుచూసే ఓ కుర్రాడు. బస్సులో చూసిన అమ్మాయితో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి తాను పెళ్లి చూపులకు వెళ్లిన మరో అమ్మాయి స్నేహితురాలు అని తెలిసి మరింత ఆశ్చర్యపోతాడు. దానికి తోడు తమకు బంధువులే అవుతారని తెలియడంతో ఇక పెళ్లికి ఇబ్బంది ఉండదని భావించి ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఒక షాక్ ఎదురవుతుంది. తర్వాత ఆమె కళ్ళలో ఉన్న ప్రేమ నిజం కాదని తెలిసి ఆమె కోసం పడే తపన చాలామందికి ప్రేమికులకు కనెక్ట్ అయ్యేలా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా దర్శకుడు రాసుకున్న తీరు అభినందనీయం. క్లైమాక్స్ చూసిన తర్వాత షాక్ అవ్వని వారు ఉండరు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి వారు కూడా ఉంటారా అని కూడా షాక్ అవుతారు. సినిమాలో అందరూ కొత్తవారే ఉండడం కొంత మైనస్. కొన్ని పాత్రలకు అయినా రిజిస్టర్డ్ నటులను పెట్టుకుని ఉంటే ఆ ఇంపాక్ట్ వేరేలా ఉండేది. అలాగే ఏపీ-కర్ణాటక బోర్డర్ లోని స్లాంగ్ కాకుండా వేరే నేపధ్యం తీసుకుని ఉంటే కనెక్టివిటీ పెరిగి ఉండేది.

తుది తీర్పు

ప్రేమికులకు బాగా కనెక్ట్ అయ్యే ఎవర్ గ్రీన్ “లవ్ రెడ్డి”.

రేటింగ్

3/5

"Love Reddy" Movie Review
“Love Reddy” Movie Review

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here