బైకర్ లో చేసిన బుల్లెట్ సునీల్ క్యారెక్టర్ నా కెరీర్ లో చాలా కొత్తగా ఉంటుంది. సినిమా హాలీవుడ్ రేంజ్ లో వచ్చింది. ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది: హీరో రాజశేఖర్

0
7
Rajasekhar Interview About Biker
Rajasekhar Interview About Biker

బైకర్ లో చేసిన బుల్లెట్ సునీల్ క్యారెక్టర్ నా కెరీర్ లో చాలా కొత్తగా ఉంటుంది. సినిమా హాలీవుడ్ రేంజ్ లో వచ్చింది. ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది: హీరో రాజశేఖర్

చార్మింగ్ స్టార్ శర్వా, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామా ‘బైకర్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా రూపొందుతున్న బైకర్ డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే గ్లింప్స్‌లు, పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై హ్యుజ్ బజ్‌ క్రియేట్ చేశాయి. ఏప్రిల్ 3న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో రాజశేఖర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

బైకర్ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది కదా.. మీరు హీరోగా నటించిన సినిమా వస్తున్నప్పుడు ఉన్నంత టెన్షన్ ఉందా లేదా రిలాక్స్డ్ గా ఉన్నారా ?

-చాలా రోజుల తర్వాత నేను చేసిన సినిమా రిలీజ్ అవుతోంది. నేను బాగా ఇష్టపడి చేసిన సినిమా బైకర్. ఎప్పుడు ఏప్రిల్ 3 వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది చాలా ఆనందంగా ఉంది. నేను నటించిన సినిమా ఇది. నా సినిమాలానే ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఆడియన్స్ ఎంతలా మెచ్చుకుంటారు? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

ఈ సినిమా మీరు యాక్సెప్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏమిటి ?
-ముందుగా నేను ఏ క్యారెక్టర్ చేసిన అది బాగుండాలి, నాకు నచ్చాలి. అప్పుడే నేను చేయగలుగుతాను. అలాగే క్యారెక్టర్ బాగుంటే సరిపోదు. సినిమా కూడా అద్భుతంగా ఆడాలి. కథ బాగుండాలి. నేను బైకర్ కథ విన్నప్పుడు నా క్యారెక్టర్, కథ రెండు నచ్చే ఈ సినిమా చేశాను. బైకర్ కథ పరంగా సూపర్ గా హిట్ అవుతుంది. అలాగే నా క్యారెక్టర్ కూడా అద్భుతంగా వచ్చింది. సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.

మీకు బైక్స్ అంటే పర్సనల్ గా ఇష్టమా?
-నాకు చిన్నప్పటినుంచి బైక్స్ అంటే చాలా ఇష్టం. మా అమ్మమ్మగారింట్లో ఒక బుల్లెట్ బండి ఉండేది. నేను సెలవుల్లో అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఆ ఊరు మొత్తం బుల్లెట్లో తిరిగేవాడిని. ఆ తర్వాత బైక్స్ మీద ఆసక్తి పెరుగుతూ వచ్చింది. శేషు సినిమా సమయంలో స్వయంగా నేనే యమహా సిక్స్ ఫిఫ్టీ సిసి బండి కొనుక్కొని ఆ షూటింగ్ కి వాడడం జరిగింది. ఆ తర్వాత అదే బైక్ ని రోజు నడుపుకునేవాడిని. నేను నడిపే విధానం చూసి ‘మీరు చాలా రిస్క్ తో నడుపుతున్నారని నాకు తెలియకుండానే జీవిత ఆ బైక్ అమ్మేశారు (నవ్వుతూ) బైకర్ లో నా క్యారెక్టర్ పేరు బుల్లెట్ సునీల్. ఈ క్యారెక్టర్ గురించి పూర్తి వివరాలు మీరు సినిమాలోనే చూడాలి.

డైరెక్టర్ అభిలాష్ రెడ్డి గురించి ?
-అభిలాష్ గారు చాలా మంచి డైరెక్టర్. ఒక యాక్టర్ నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ కావాలో ఆయనకి చాలా క్లారిటీ ఉంటుంది. ఆయన కథ మీద క్యారెక్టర్ మీద చాలా గ్రిప్ ఉన్నా దర్శకుడు . ఆయన అనుకునది వచ్చేంతవరకు ఎక్కడ కూడా రాజీపడరు. చాలా ఇన్వాల్వ్మెంట్ ఉన్న డైరెక్టర్.

-ఈ క్యారెక్టర్ కి సంబంధించి ఆయన ప్రతి విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. ఈ సినిమాలో నన్ను చాలా కొత్తగా చూపించారు. డైరెక్టర్ విజన్. కథ వల్లే అది సాధ్యపడింది. సినిమా చూసిన ప్రేక్షకులు కచ్చితంగా నా క్యారెక్టర్ ని అభినందిస్తారు.

-ఇందులో బైక్ రేసింగ్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఒక హాలీవుడ్ రేంజ్ సినిమాలా ఉంటుంది. అలాగే ఫాదర్ సన్ ఎమోషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి.

శర్వానంద్ గారితో పనిచేయడం ఎలా అనిపించింది? ఒక సీనియర్ హీరోగా మీరు ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చేవారు?
-నేను నా డైలాగ్ నా క్యారెక్టర్ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. అందరం మంచి కొలీగ్స్, ఫ్రెండ్స్ లాగా వర్క్ చేసాము.

సినిమా మీరు చూశారా ?
-ఇంకా లేదండి. రిలీజ్ రోజు అందరితో కలిసి థియేటర్ లో చూడాలని వెయిట్ చేస్తున్నాను.

యువి క్రియేషన్స్ గురించి ?
-యూవీ క్రియేషన్స్ అంటే రాయల్ ట్రీట్మెంటు. ఎక్కడ ఖర్చుకి వెనకాడరు. ఈ సినిమాని హాలీవుడ్ క్వాలిటీతో తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సబ్జెక్టు కోసం క్వాలిటీ కోసం ఎక్కడ రాజీ పడకుండా ఖర్చు చేశారు. ఈ విషయంలో వారిని అభినందించాలి. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధించి వాళ్ళు పెట్టిన ఖర్చు తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది.

మీ సినిమాల విషయంలో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది ?
-నాకు ఫ్యామిలీ ఎప్పుడు కూడా బిగ్గెస్ట్ స్ట్రెంత్. ఈ సినిమా, నా క్యారెక్టర్ ఇంత అద్భుతంగా రావడానికి ఒక కారణం జీవిత, మా పిల్లలు. వాళ్ల సపోర్టు చాలా గొప్పది. ఈ సినిమా నేను చేసినప్పుడు నన్ను స్కూల్ కి డ్రాప్ చేసి మళ్లీ అక్కడి నుంచి తీసుకొచ్చే ఒక మదర్ లాగా చూసుకున్నారు.

-మా పాషన్, ప్రొఫెషన్ రెండు సినిమానే. ఇంట్లో మొత్తం సినిమా వాతావరణమే ఉంటుంది. కొత్త సినిమాలు రిలీజ్ అయితే నేరుగా థియేటర్స్ కి వెళ్లి చూస్తుంటాం. అలాగే ఏదైనా కథ క్యారెక్టర్ వస్తే అందరం కలిసి డిస్కస్ చేస్తాం. అలాగే షూటింగ్లో జరిగిన విశేషాలు కూడా మాట్లాడుకుంటుంటాం. మేమందరం కూడా సినిమా ప్రొఫెషన్ లోనే ఉన్నాం కాబట్టి చాలా కంఫర్ట్ ఉంటుంది.

కొత్తగా చేస్తున్న సినిమాలు గురించి ?
-పవన్ సాదినేని గారితో ‘మగాడు’ అనే సినిమా చేస్తున్నాను. అది ఇంకా 20% మిగిలింది. నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ అనుకుంటున్నారు. అలాగే నేను రమ్య విశ్వదేవ్ శివాని కలిసి ఒక సినిమా చేస్తున్నాం. అది షూటింగ్ జరుగుతుంది త్వరలోనే టైటిల్ రిలీజ్ చేస్తాం. బైకర్ తో పాటు ఈ రెండు సినిమాలు కూడా కచ్చితంగా నా కెరీర్లో చాలా మంచి సినిమాలు అవుతాయని నమ్మకం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here