అంచనాలను రెట్టింపు చేసిన ‘రాకాస’ ట్రైలర్.. ఏప్రిల్ 3న రిలీజ్ మూవీ గ్రాండ్ రిలీజ్
నిహారిక.. జీ స్టూడియోస్ సమర్పణలో తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘రాకాస’. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ అవుతోంది. ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, సాంగ్స్‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది. డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్‌తో మూవీపై బజ్ క్రియేట్ అయ్యింది. ఈ క్రమంలో మేకర్స్ బుధవారం రోజున ట్రైలర్‌ను విడుదల చేశారు. లేటెస్ట్‌గా విడుదలైన ఈ ట్రైలర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింతగా పెంచాయి.
ట్రైలర్‌ను గమనిస్తే..
“RaKaSa” Trailer ▶️
‘ఆ కోటలో ఉన్నది.. ఊరు బలి పంపుతున్నది సామాన్యుడికి కాదు.. భీకర బ్రహ్మ రాక్షసుడికి’ అనే డైలాగ్‌తో ‘రాకాస’ ట్రైలర్ ప్రారంభమవుతుంది. దానికి అనుగుణంగా చూపించే పురాతనమైన కోట.. బ్రహ్మ రాక్షసుడు ఇవన్నీ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి.
భయంతో నడుస్తున్న గెటప్ శీను ఓ పిల్లాడు చేసిన బూర సౌండ్‌కి జడుసుకుంటాడు. వెంటనే ‘నువ్వు పెద్ద డిఎస్‌పి అనుకుంటున్నావా? లోపలకిపో..కోతి నాయాలా!’ అని తిడతాడు.
హీరో సంగీత్ శోభన్, నయన సారికల మధ్య ఉన్న ప్రేమ.. హీరో, హీరోయిన్‌కు మధ్య ఉన్న సీన్స్‌ను చూపిస్తూ వారి మధ్య ఉన్న లవ్ యాంగిల్‌ను రివీల్ చేశారు.
బస్సులో సంగీత్, తనికెళ్ల భరణి, గెటప్ శీను మధ్య వచ్చే కామెడీ సీన్ ఆకట్టుకుంటోంది.
పోలీస్ ఆఫీసర్ సంగీత్‌ను ఉద్దేశించి ‘రాత్రి ఏం జరిగింది?’ అని అడిగితే..‘పడుకోవడం లేటయ్యింది’ అని కామెడీగా సమాధానమిస్తాడు.
‘వేళాకోళంగా ఉందా? నా హిస్టరీ నీకు తెలియదు’ అని బ్రహ్మాజీ సంగీత్‌తో అంటే.. ‘ఏం డిలీట్ చేస్తారా?’ అని ఇచ్చే ఫన్నీ కౌంటర్ ఆకట్టుకుంటోంది.
‘ఊరుకొచ్చినప్పటి నుంచి నా జీవితం ఎటేలుతుందో తెలియటం లేదు’ అని హీరో టెన్షన్ పడటం
దానికి తోడు ట్రైలర్లో చూపించే ఉల్క పతనం..రాత్రికి రాత్రి పశువులు కలేబరాలుగా మారటం చూస్తే ఊర్లో ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది.
ఊరు బతికి బయటపడాలంటే బలి పంపాల్సిందే అంటూ తనికెళ్లభరణి చెప్పటం..కోటకు సంబంధించిన తాళాన్ని చూపించటం చూస్తే కోటకు, ఊరుకి మధ్య ఏదో లింకు ఉందనేది అర్థమవుతుంది. ట్రైలర్ చివరలో ‘ఈమాత్రం దానికేనా.. లోపల నీకుంటది అసలైన మ్యూజిక్ అనటంతో..’ బ్రహ్మ రాక్షసుడు ఉండే కోటలోకి హీరో సంగీత్ ఎంట్రీ ఉంటుంది.. ఆ కోటలోకి వెళ్లిన హీరో ఏం చేశాడు? ఊరిని కాపాడాడా? తన ప్రేమను గెలిపించుకున్నాడా? అనే విషయాలు తెలియాలంటే మాత్రం ఏప్రిల్ 3న రిలీజ్ కానున్న రాకాస సినిమా చూడాల్సిందేనని ఆసక్తి రెట్టింపు అయ్యింది.
రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ, అనుదీప్ దేవ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ఎసెట్‌గా మారింది.
నటీనటులు : సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్
నిర్మాతలు: నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్
రచన, దర్శకత్వం : మానస శర్మ
సినిమాటోగ్రఫీ : రాజు ఎదురురోలు
సంగీతం : అనుదీప్ దేవ్
ఎడిటర్ : అన్వర్ అలీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రమేష్ మన్యం
కొరియోగ్రఫీ : జెడి, భాను
ఆర్ట్ డైరెక్టర్ : విష్ణు వర్ధన్ పుల్లా
కాస్ట్యూమ్ డిజైనర్ : సంధ్య సబ్బవరపు
పి.ఆర్.ఒ : నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)



