అనంతపురం లో గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన సినీ నటి మాళవిక మోహన్

0
6
GOYAZ 23rd STORE Inaugurated by Actress Ms. MALAVIKA MOHANAN IN ANANTAPUR
GOYAZ 23rd STORE Inaugurated by Actress Ms. MALAVIKA MOHANAN IN ANANTAPUR

అనంతపురం లో సందడి చేసిన సినీనటి మాళవిక మోహన్
గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన సినీ నటి మాళవిక మోహన్

గోయాజ్ కలక్షన్లు తనకు ఎంతో ఇష్టమని , అనంతపురం లో ఏర్పాటైన కలెక్షన్స్ చూస్తుంటే అన్ని తీసేసుకోవాలని ఉందని సినీనటి మాళవిక మోహన్ (రాజసాబ్ ఫేం) అన్నారు. అనంత పురం సుభాష్ రోడ్డులో గోయజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను శనివారం సినీనటి మాళవిక మోహన్ ప్రారంభించారు. గోయాజ్ సిల్వర్ జూవేలరీ23 వ షోరూంను నేను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో 22స్టోర్లతో విస్తరించి అనంత పురం లో 23వ స్టోర్ ప్రారంభమైందన్నారు. యువతులు అందంగా కనిపించేందుకు ఈ జ్యువెలరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ షోరూంలో మంచి సిల్వర్‌ జ్యువెలరీ కలెక్షన్లు ఉన్నాయని సినీనటి మాళవిక మోహన్ అన్నారు.

నిర్వాహకులు రవితేజ వేములూరి, ప్రియాంక వేములూరి మాట్లాడుతూ అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలు పొందిన ఏకైక సిల్వర్‌ జ్యువెలరీ స్టోర్‌ గోయాజ్‌ అని, అనంత పురం లో ఈ రోజు ప్రారంభించిన మా గోయాజ్ షో రూంలో అన్నిరకాల వెండి ఆభరణాలు సరస మైన ధరలలో అందుబాటులో ఉన్నాయన్నారు. మా 23 వ స్టోర్ ను అనంతపుర ప్రజలకు అందుబాటులోకి తేవడం సంతోషం గా ఉందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here