శ్రీ మిథున్ చక్రవర్తి గారికి హృదయపూర్వక అభినందనలు

0
42
Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan Congratulates Mithun Chakraborty On Receiving Dadasaheb Phalke Award
Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan Congratulates Mithun Chakraborty On Receiving Dadasaheb Phalke Award

శ్రీ మిథున్ చక్రవర్తి గారికి హృదయపూర్వక అభినందనలు

ప్రముఖ నటులు, రాజ్యసభ సభ్యులు శ్రీ మిథున్ చక్రవర్తి గారికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషాన్ని కలిగించింది. శ్రీ మిథున్ చక్రవర్తి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. హిందీ, బెంగాలీ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. 80వ దశకంలో దేశవ్యాప్తంగా యువతపై ఆయన ప్రభావం ఉంది. ‘డిస్కో డ్యాన్సర్’ చిత్రం ద్వారా ఆయన నృత్య శైలులు ఉర్రూతలూగించాయి. ‘ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్సర్…’ అనే పాటను ఎవరూ మరచిపోలేరు. హిందీ చిత్రసీమలో శ్రీ అమితాబ్ బచ్చన్ గారి తరవాత అంత క్రేజ్ దక్కించుకున్న కథానాయకుడు శ్రీ మిథున్ చక్రవర్తి గారు. నేను నటించిన ‘గోపాల గోపాల’ సినిమాలో లీలాధర్ స్వామిగా కీలక పాత్ర పోషించారు. విద్యార్థి దశలో వామపక్ష భావజాలం కలిగిన ఆయన తరవాతి కాలంలో టీఎంసీ, అటు పిమ్మట బీజేపీలో చేరారు. దశాబ్ద కాలంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకోనున్న శ్రీ మిథున్ చక్రవర్తి గారికి భగవంతుడు సంపూర్ణ సంతోషాన్ని, ఆయురారోగ్యాలను ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.

(పవన్ కళ్యాణ్)
ఉప ముఖ్యమంత్రి 
ఆంధ్ర ప్రదేశ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here