వరద బాధితుల సహాయార్థం తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళం అందించిన ఎన్టీఆర్
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కొన్ని ప్రాంతాల ప్రజలు వరదల కారణంగా చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన వర్షాల కారణంగా సంభవించిన ఈ వరదలతో ప్రజలు ఇబ్బందులను పడుతున్నారు. ఇలాంటి తరుణంలో తెలుగు రాష్ట్రాలకు సాయం అత్యవసరం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన పెద్ద మనసుని, మానవత్వాన్ని చాటుకునే హీరో ఎన్టీఆర్ మరోసారి తన గొప్ప మనసుని చాటుకున్నారు. వరద బాధితులకు అండగా తనవంతు సాయాన్ని అందించటానికి ఆయన ముందుకు వచ్రచారు.
వరదలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయిన ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.50 లక్షలు, తెలంగాణ రాష్ట్రానికి రూ.50 లక్షలు విరాళంగా అందించారు