డిసెంబ‌ర్‌లో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతోన్న ‘కె.డి: ది డెవిల్స్ వార్ ఫీల్డ్’… రూ. 17.70 కోట్ల‌కు అమ్ముడైన‌ ఆడియోరైట్స్

0
58

 

ప్రిన్స్ ధృవ స‌ర్జా హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ కె.వి.ఎన్‌.ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోన్న‌ భారీ బ‌డ్జెట్ చిత్రం ‘కె.డి: ది డెవిల్స్ వార్ ఫీల్డ్’. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్‌లో గ్రాండ్ రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. 1970లో బెంగుళూరులో జ‌రిఇన నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారం చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ పీరియాడిక్ డ్రామాపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ అయ్యాయి. ఈ క్ర‌మంలో ‘కె.డి: ది డెవిల్స్ వార్ ఫీల్డ్’ ఆడియో రైట్స్ రూ.17.70 కోట్ల ఫ్యాన్సీ ఆఫ‌ర్‌కు అమ్ముడ‌య్యాయి.

అనౌన్స్‌మెంట్ రోజు నుంచి ‘కె.డి: ది డెవిల్స్ వార్ ఫీల్డ్’చిత్రంపై మంచి అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. ఆగ‌స్ట్‌లో ఈ మూవీ నుంచి తొలి సాంగ్‌ను రిలీజ్ చేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించటంతో ఇవి నెక్ట్స్ లెవ‌ల్‌కు రీచ్ అయ్యాయి. శిల్పా శెట్టి కుంద్రా, రమేష్ అరవింద్, సంజయ్ దత్, నోరా ఫతేహి, వి రవిచంద్రన్ తదితరులు నటిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌టానికి సిద్ధ‌మ‌వుతుంది.

‘కె.డి: ది డెవిల్స్ వార్ ఫీల్డ్’ సినిమా ప్రేక్ష‌కుల‌ను 1970లోని బెంగుళూరు నాటి ప‌రిస్థితుల‌కు తీసుకెళ‌తాయి. అప్పుడు జ‌రిగిన కొన్ని నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ యాక్ష‌న్‌, పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ ఏడాది ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న సినిమాల్లో ఇదొక‌టి.

కె.వి.ఎన్‌.ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రేమ్ ద‌ర్శ‌కుడిగా ‘కె.డి: ది డెవిల్స్ వార్ ఫీల్డ్’ తెర‌కెక్కుతోంది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని క‌న్న‌డ‌, త‌మిళ‌, తెలుగు, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here