తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కు 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన నిర్మాత ఎస్ కేఎన్

0
61

తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఈ రోజు జరిగాయి. గుడుంబా శంకర్ దర్శకులు వీర శంకర్ నేతృత్వంలోని ప్యానల్ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఈ ప్యానల్ లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన వీరశంకర్ తో పాటు ఉపాధ్యక్షులుగా సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్స్ సాయి రాజేష్ , వశిష్ట భారీ మెజారిటీతో గెలుపొందారు.

బేబి చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న యువ నిర్మాత ఎస్ కేఎన్ ఈ విజయోత్సవ సభలో తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యుల గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం కోసం తనవంతుగా 10 లక్షల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు. తన స్నేహితులైన దర్శకులు సాయి రాజేశ్, వశిష్టకు మద్ధతుగా ఎస్ కేఎన్ ఈ విరాళాన్ని అందించారు. ముఖ్యంగా తన స్నేహితుడు సాయి రాజేశ్ తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ వాగ్ధానానికి మద్ధతుగా 10 లక్షల రూపాయల విరాళాన్ని ఎస్ కేఎన్ అందించారు. నిర్మాత ఎస్ కేఎన్ ఇచ్చిన విరాళం పట్ల తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. నిర్మాత ఎస్ కేఎన్ కు చప్పట్లతో అభినందనలు తెలిపారు. దర్శకుల సంఘానికి ఒక నిర్మాత ఇలా విరాళం ఇవ్వడంపై హర్షం వ్యక్తమవుతోంది.

తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో చరిత్ర సృష్టించారు సాయి రాజేశ్. ఉపాధ్యక్ష పదవికి పోటీ పడిన సాయి రాజేశ్ కు 576 ఓట్లు వచ్చాయి. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఇన్నేళ్ల చరిత్రలో ఒక పదవికి పోటీ చేసిన వ్యక్తికి ఇంత భారీగా ఓట్లు రావడం ఇదే తొలిసారి. ఇదొక ఎవర్ గ్రీన్ రికార్డ్ గా నమోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here