సతీశ్ వేగేశ్న చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంటుందన్న సంగతి తెలిసిందే. ఆయన ‘కథా కేళి’ చిత్రంతో తన కొడుకు యశ్విన్‌ను హీరోగా లాంచ్ చేయబోతోన్నారు. చింతా గోపాలకృష్ణా రెడ్డి సమర్పణలో శతమానం భవతి ఆర్ట్స్ బ్యానర్‌పై సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ టీజర్‌ను దిల్ రాజు చేయగా.. అది ఎంతగానో వైరల్ అయింది. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది.
Team #KathaKeli wraps up shooting with a burst of energy and positivity! 🤗
Gearing up to deliver a crazy thrilling saga in cinemas soon 🥳#KathaKeli@VegesnaSatish1 #Yashwin #Ajay @YoursEesha @IMNandiniRai@AnanyaNagalla @IDineshTej #PujitaPonnada @VamsiKaka pic.twitter.com/L1Vn364tJE
— BA Raju's Team (@baraju_SuperHit) February 7, 2024
సతీశ్ వేగేశ్న ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేశారు. చిత్రయూనిట్ షూటింగ్‌కు ప్యాకప్ చెప్పేసింది. సినిమా షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. ఇక చివరి రోజున ఇలా చిత్రయూనిట్ అంతా కూడా సందడిగా కనిపించారు. ఈ మేరకు మేకర్స్ షేర్ చేసిన ఫోటోల్లో చిత్రయూనిట్ అంతా కనిపిస్తోంది.
ఈ చిత్రానికి ఎస్.కె.బాలచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. దాము నర్రావుల కెమెరామెన్‌గా, మధు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను ప్రకటించనున్నారు.
నటీనటులు:
యశ్విన్, దినేశ్ తేజ్, అజయ్, బాలాదిత్య, పూజితా పొన్నాడ, నందిని, ఆయుషి, ప్రీతి, విరాట్ తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: శతమానం భవతి ఆర్ట్స్
సమర్పణ: చింతా గోపాల కృష్ణా రెడ్డి
రచన, దర్శకత్వం: సతీశ్ వేగేశ్న
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వేగేశ్న ప్రదీప్ రాజు
మ్యూజిక్ డైరెక్టర్: ఎస్.కె.బాలచంద్రన్
సినిమాటోగ్రఫీ: దాము నర్రావుల
ఎడిటర్: మధు
ఆర్ట్: రామాంజనేయులు
లిరిసిస్ట్: శ్రీమణి
చీఫ్ కో డైరెక్టర్ : నరేంద్ర వర్మ మంతెన
పి.ఆర్.ఓ: వంశీ కాకా