మకర సంక్రాంతి శుభ సందర్భంగా 2024లో తమ ఎక్సయిటింగ్ తెలుగు మూవీస్ లైనప్ ని ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్

0
84

ఈ సంవత్సరం థియేట్రికల్ విడుదల తర్వాత, 12 తెలుగు సినిమాలు నెట్‌ఫ్లిక్స్ 2024 స్లేట్‌లో భాగం కానున్నాయి

ముంబై, 15 జనవరి 2024: నెట్‌ఫ్లిక్స్, 2024 కోసం లైసెన్స్ పొందిన తెలుగు కంటెంట్ ఆఫరింగ్ లో భాగంగా 12 చిత్రాల లైనప్‌ను అనౌన్స్ చేసింది. ఈ చిత్రాలు ఈ సంవత్సరం థియేట్రికల్ ప్రదర్శన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటాయి. అభిమాన నటుల పెర్ఫార్మెన్స్ మ్యాజిక్ ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఇళ్లలో ఆస్వాదించే అవకాశాన్ని కల్పిస్తోంది నెట్‌ఫ్లిక్స్‌.

నెట్‌ఫ్లిక్స్ వారి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో 12 టైటిల్స్ యొక్క స్నీక్ పీక్‌తో అభిమానులను అలరించి ప్రేక్షకులలో ఎక్సయిట్ మెంట్ ని పెంచింది. 2023లో భోలా శంకర్, దసరా, బ్రో, మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి, మ్యాడ్, ఖుషి వంటి చిత్రాలను ఆస్వాదించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినిమా అభిమానులు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ 2024లో అందించే చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప కి సీక్వెల్ పుష్ప 2, జూనియర్ ఎన్టీఆర్ దేవర, ప్రభాస్ సలార్‌, స్టూడియో గ్రీన్- బడ్డీ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్- గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, వైర ఎంటర్‌టైన్‌మెంట్ -హాయ్ నాన్నా, యువీ క్రియేషన్స్ కార్తికేయ – ప్రొడక్షన్ నెం.12, స్ప్రింట్ స్క్రీన్స్ LLP NBK 109, Ga2 పిక్చర్స్ ప్రొడక్షన్ నెం 9, మ్యాంగో మాస్ అన్ టైటిల్డ్ సిద్ధు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ -టిల్లు స్క్వేర్.
స్ప్రింట్ స్క్రీన్స్ LLP VD 12 ( అన్ టైటిల్డ్ విజయ్ దేవరకొండ) లాంటి ఎక్సయిటింగ్ చిత్రాలు 2024లో నెట్‌ఫ్లిక్స్ లో అలరించబోతున్నాయి.

అప్ కమింగ్ లైనప్ గురించి నెట్‌ఫ్లిక్స్ ఇండియా విపి – కంటెంట్ మోనికా షెర్గిల్ మాట్లాడుతూ.. “నెట్‌ఫ్లిక్స్ సౌత్ కంటెంట్ వ్యూస్ లో 50% YoY గ్రోత్ మా తెలుగు సినిమా స్ట్రాంగ్ అప్పీల్ ప్రతిబింబిస్తుంది. ఈ సంవత్సరం లైనప్, అత్యుత్తమ తెలుగు బ్లాక్‌బస్టర్ సినిమాలతో, ఇండస్ట్రీ బిగ్ స్టార్స్ తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది. భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అత్యుత్తమ తెలుగు చిత్రాలని అందించడం మాకు చాలా ఆనందంగా ఉంది” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here