కింగ్ నాగార్జున అక్కినేని పుట్టినరోజు సందర్భంగా అభిమానులను ఆనందపరిచే విధంగా ఆయన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. పలు ప్రముఖ చిత్రాలకు పనిచేసిన పాపులర్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని మాస్ జాతరగా రూపొందుతున్న ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రిచ్ ప్రొడక్షన్ డిజైన్, అత్యుత్తమ టెక్నికల్ స్టాండర్డ్స్ తో రూపొందనున్న ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
మరో బిగ్ సర్ ప్రైజ్ గా మేకర్స్ ఒక గ్లింప్స్ , ఫస్ట్-లుక్ పోస్టర్ ద్వారా సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘నా సామిరంగ’ అనే క్యాచీ టైటిల్‌ని ఖరారు చేశారు. టైటిల్ వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఏఎన్ఆర్ కల్ట్ హిట్ ‘సిపాయి చిన్నయ్య’ లోని నా సామి రంగ అనే ఐకానిక్ సాంగ్.
నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బీడీ తాగుతూ మాసీ హెయిర్ స్టయిల్, గడ్డంతో మాస్ అవతార్ లో కనిపించారు. టైటిల్ గ్లింప్స్ ‘నా సామి రంగ’ వరల్డ్ ని మనకు పరిచయం చేస్తుంది. పలాస ఫేమ్ కరుణ కుమార్ & అతని గూండాల బ్యాచ్ హీరోని చంపడానికి చూస్తున్నప్పుడు.. సింబాలిక్‌గా కింగ్‌గా పరిచయం అవుతారు. ఇక నాగార్జున ఎంట్రీతో అసలు మాస్ జాతర మొదలవుతుంది. అతని పేరు వినగానే ప్రత్యర్థులు వణుకుతున్నప్పుడు అతను వారిపై దాడి చేయడం మొదలుపెడతాడు. నాగార్జున మాస్ లుక్, ఎక్స్ టార్డీనరీ స్క్రీన్ ప్రెజెన్స్ సీక్వెన్స్‌కు బలాన్ని తెచ్చింది. విజువల్స్ అత్యుత్తమంగా వున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ ఎలివేషన్స్ ఇస్తుంది. ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్‌తో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
ఈ సారి పండక్కి నా సామిరంగ 💥
King @iamnagarjuna's #NaaSaamiRanga ❤️🔥
World Wide Release on Sankranti 2024
Here's the Title Glimpse
➡️ https://t.co/uTnIvfL5Ha#HBDKingNagarjuna 🎊@ChoreographerVJ @mmkeeravaani @prasu_bezawada @srinivasaaoffl… pic.twitter.com/ySgQv9QPkm
— BA Raju's Team (@baraju_SuperHit) August 29, 2023
నాగార్జున కు అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించి ఆస్కార్, జాతీయ అవార్డును గెలుచుకున్న లెజెండరీ కంపోజర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, డైలాగ్స్ అందించారు. ఇందులో విభిన్న క్రాఫ్ట్ లలో పాపులర్ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.
మేకర్స్ మరో సర్ ప్రైజ్ అప్‌డేట్ ఇచ్చారు. ‘నా సామిరంగ’ 2024 సంక్రాంతికి థియేట్రికల్ రిలీజ్ అవుతుంది. సినిమాల విడుదలకు సంక్రాంతి చాలా పెద్ద సీజన్, అలాగే ఈ పండుగకు అనేక హిట్‌లు సాధించిన నాగార్జునకు ఇది మోస్ట్ ఫేవరేట్ సీజన్. ఇది అక్కినేని అభిమానులకు నిజమైన పండుగ కానుంది. పండగ సెలవుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ వినోదాత్మక సినిమాకే ఉంటుంది.
తారాగణం: కింగ్ నాగార్జున అక్కినేని, కరుణ కుమార్
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: విజయ్ బిన్ని
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
సంగీతం: ఎంఎం కీరవాణి
సమర్పణ: పవన్ కుమార్
కథ, డైలాగ్స్: ప్రసన్న కుమార్ బెజవాడ
పీఆర్వో: వంశీ-శేఖర్