గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, షైన్ స్క్రీన్స్ బ్యానర్ సక్సెస్ ఫుల్ ప్రోడ్యూసర్ సాహు గారపాటి, హరీష్ పెద్ది.. డెడ్లీ కాంబినేషన్ లో రూపొందుతున్న #NBK108 కు ‘భగవంత్ కేసరి’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. ఇది ఈ చిత్రంలో బాలకృష్ణ పాత్ర పేరు. యూనిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఐ డోంట్ కేర్’ క్యాప్షన్ బాలకృష్ణ ఎదురులేని వైఖరిని సూచిస్తుంది.
టైటిల్ లోగో భారతదేశ చిహ్నం (అశోక సింహ రాజధాని)తో అద్భుతంగా డిజైన్ చేశారు. బాలకృష్ణ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ లో కనిపించారు. బ్రౌన్ కలర్ కుర్తా, ఫార్మల్ ప్యాంటు ధరించారు. అతని చేతులకు ఒక బ్రాస్లెట్, ఒక వాచ్, మెడలో స్టోల్ ని గమనించవచ్చు. మోకాళ్లపై కూర్చున్న బాలకృష్ణ ఆవేశంతో ఒక ఆయుధాన్ని నేలపై కొట్టారు. బ్యాగ్రౌండ్, బాలకృష్ణ ఎక్స్ ప్రెషన్ చూస్తే ఈ పిక్చర్ భారీ యాక్షన్ సీక్వెన్స్ లోదని అర్ధమౌతోంది.
అనిల్ రావిపూడి ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని గెటప్, క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేస్తున్నారు. టైటిల్ లాగే పోస్టర్ కూడా మన దృష్టిని ఆకర్షిస్తోంది. నిర్మాతలు దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. టైటిల్ పోస్టర్‌ను ప్రత్యేకమైన పద్ధతిలో లాంచ్ చేశారు. టైటిల్ పోస్టర్ల 108 లొకేషన్లలో 108 హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. అంతే కాదు.. బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10) కోసం మరిన్ని సర్ ప్రైజ్ లు వున్నాయి.
కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
#NandamuriBalakrishna in & as #BhagavanthKesari 💥#NBKLikeNeverBefore ❤️🔥 pic.twitter.com/C19FnX4fRk
— BA Raju's Team (@baraju_SuperHit) June 8, 2023
ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా, సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్ పార్ట్‌కి వి వెంకట్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. భగవంత్ కేసరి విజయదశమి (దసరా)కి థియేటర్లలో విడుదల కానుంది.
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, అర్జున్ రాంపాల్, కాజల్ అగర్వాల్, శ్రీలీల
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
బ్యానర్: షైన్ స్క్రీన్స్
సంగీతం: ఎస్ థమన్
డీవోపీ: సి రామ్ ప్రసాద్
ఎడిటర్: తమ్మి రాజు
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్
ఫైట్స్: వి వెంకట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ
పీఆర్వో: వంశీ-శేఖర్