అటు బుల్లి తెర ఇటు సిల్వర్ స్క్రీన్‌పై తనదైన గుర్తింపు సంపాదించుకున్న యాక్టర్ సుడిగాలి సుధీర్. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కాలింగ్ సహస్త్ర’. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ సరసన డోలిశ్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి బుధవారం ‘కలయా నిజమా..’ అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
ఈ సాంగ్ వింటుంటే హీరోపై హీరోయిన్‌కు ప్రేమ పుట్టినప్పుడు వచ్చే సాంగ్‌లా అనిపిస్తుంది. హీరోయిన్ తన మనసులో హీరోపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తుంది. ట్యూన్ హృదయాన్ని సునిశితంగా తాకుతుంది. మెహిత్ రహ్‌మానిక్ సంగీతం అందించిన ఈ పాటను లక్ష్మీ ప్రియాంక రాశారు. ప్రముఖ సింగర్ కె.చిత్ర ఈ పాటను పాడారు. ఆమె శ్రావ్యమైన గొంతులోనుంచి పాటను వింటుంటే ప్రేక్షకులు మైమరచిపోవటం ఖాయం.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘‘సహస్త్ర కాలింగ్’ చిత్రం నుంచి ‘కలయా నిజమా…’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశాం. లెజెండ్రీ సింగర్ చిత్రగారు అద్భుతంగా పాడారు. మెహిత్ అందించిన ట్యూన్, దానికి లక్ష్మీ ప్రియాంకగారు రాసిన లిరిక్స్ బ్యూటీఫుల్‌గా కుదిరాయి. సుడిగాలి సుధీర్, డోలిశ్య మధ్య కెమిస్ట్రీ బ్యూటీఫుల్‌గా ఉంటుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తాం’’ అన్నారు.
Song link
*కాలింగ్ సహస్త్ర పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నాయి.*
నటీనటులు:
సుడిగాలి సుధీర్, డోలిశ్య, స్పందనాపల్లి, శివ బాలాజీ తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్స్: షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్
నిర్మాతలు: విజేష్ కుమార్ తయల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కటూరి
దర్శకత్వం: అరుణ్ విక్కిరాలా
సంగీతం: మోహిత్ రెహమానిక్
సినిమాటోగ్రఫీ: సన్నీ.డి
యాక్షన్: శివరాజ్
ఎడిటర్: గ్యారీ బి.హెచ్
పి.ఆర్.ఓ: నాయుడు సురేంద్ర – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)