చక్ర వ్యూహ్యం మూవీ రివ్యూ

0
495

సినిమా: చక్రవ్యూహం

బ్యానర్: సహస్ర క్రియేషన్స్

నిడివి: 1 గం 51 నిలు

సెన్సార్ సర్టిఫికేట్: యు / ఏ

విడుదల తేదీ: 02-06-2023

నటీనటులు: అజయ్, జ్ఞానేశ్వరి కండ్రేగుల

సంగీతం: భరత్ మంచిరాజు

ఎడిటింగ్: జెస్విన్ ప్రభు

నిర్మాత: శ్రీమతి సావిత్రి

రచన, దర్శకత్వం: చేట్కురి మధుసూదన్

 

బేబీ అన్వి సమర్పణలో సహస్ర క్రియేషన్స్ బ్యానర్‌పై విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు అజయ్ ప్రధాన పాత్రలో చెట్కూరి మధుసూధన్ దర్శకత్వంలో తెరకెక్కిన మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌ చిత్రం “చక్రవ్యూహం’ – ది ట్రాప్ అనేది ఉపశీర్షిక. థ్రిల్లర్ గా రూపొంది ప్రచార చిత్రాలతో ఆసక్తి రేకెత్తించిన చక్రవ్యూహం చిత్రాన్ని శ్రీమతి. సావిత్రి నిర్మించారు. జూన్ 2 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం .

కథ

వివేక్ ( సంజయ్ ) ఊర్వశి పరదేశి ( సిరి )లు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. హ్యాపీ గా సాగుతున్న వీరి జీవితంలో ఊహించని విధంగా సిరి హత్య కు గురవుతుంది. ఆ తరువాత ఈమె హత్యతో సంబందించిన వారందరూ వరుసగా హత్యకు గురవుతుంటారు. ఎన్నో ట్విస్ట్ ల మధ్య హత్యలు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు అనేది సస్పెన్స్ గా ఉంటుంది. ఈ కథలో సంజయ్ స్నేహితుడు సుదేశ్ (శరత్)  ప్రగ్య నయన్ ( శిల్ప) పాత్రేమిటి ఈ హత్యలవెనుక ఉన్న అసలు మిస్టరీ ను పోలీసులు ఎలా చేదించారనేదే “చక్ర వ్యూహ్యం”

నటీ నటుల పనితీరు:

సంజయ్ పాత్రలో నటించిన వివేక్ ఇటు భర్త గా, సైకో గా తన పాత్రకు తగ్గ ఎక్స్ప్రెషన్స్ తో చక్కటి నటనను ప్రదర్శించాడు. సిరి గా ఊర్వశి పరదేశి తన పాత్రలో ఒదిగిపోయింది. మిస్టరీ కేస్ ను ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ సత్య గా అజయ్ నటన ఈ చిత్రానికే హైలెట్. హీరో ఫ్రెండ్స్ గా నటించిన రాజ్ తిరందసు ( రవి ), కిరీటి
ఇంకా ఇందులో హీరోయిన్ కు తల్లి గా నటించిన ప్రియ, తండ్రి పాత్రలో నటించిన రాజీవ్ కనకాల ( శ్రీధర్ ), శ్రీకాంత్ అయ్యాంగార్ ( శ్రీనివాస్ ), హీరోయిన్ తాతగా నటించిన శుభలేఖ సుధాకర్ ( జగన్నాధం ) పాత్రలు చిన్నవే అయినా తమ అనుభవంతో ఆ పాత్రలకు జీవం పోశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

డైరెక్టర్ మధుసూధన్ కి తొలి సినిమా అయినప్పటికీ ఆద్యంతం ప్రేక్షకులు సస్పెన్స్ కు గురయ్యేలా చక్కటి కథ, స్క్రీన్ ప్లే, తో ఆకట్టుకున్నారు.  ప్రతి ఫ్రెమ్ లోను సస్పెన్స్ ను అలాగే కొనసాగించి దర్శకుడిగా మంచి ప్రతిభను కనబరిచాడు. కథకు తగ్గ కాస్టింగ్ ను ఎంపిక చేసుకోవడంతో ఆడియెన్స్ ను పాత్రలతో బాగా కనెక్ట్ చేయగలిగారు.

జివి అజయ్ సస్పెన్స్ తో సాగే ప్రతి సన్నివేశాన్ని తన కెమెరాలో చక్కగా బందించి తన కెమెరా పనితనాన్ని చాటారు. జెస్విన్ ప్రభు ఎడిటింగ్ పనితీరు బాగుంది. భరత్ మంచిరాజు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బేబీ అన్వి సమర్పణలో సహస్ర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీమతి. సావిత్రి గారు నిర్మించిన నిర్మాణ విలువలు క్వాలిటీ గా ఉండి సినిమాపై వారికున్న టేస్ట్ ను తెలియజేస్తుంది.  సస్పెన్స్ తో సాగే ఉత్కంఠ భరితమైన కథనాన్ని ప్రేక్షకులు మెచ్చేలా తీర్చి ద్దిన వైనం ఆకట్టుకుంటుంది.

రేటింగ్: 3/5

చివరగా: ఉత్కంఠ రేపే సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ “చక్ర వ్యూహ్యం”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here