వరద బాధితుల సహాయార్థం మంత్రి కె. టి. ఆర్ కు రెండు లక్షల రూపాయలను అందజేసిన హీరో ఉదయ్ శంకర్ “నచ్చింది గర్ల్ ఫ్రెండ్” మూవీ టీమ్

0
232

ఖమ్మం  జిల్లా వరద బాధితులను ఆదుకునేందుకు “నచ్చింది గర్ల్ ఫ్రెండ్” సినిమా నిర్మాత అట్లూరి నారాయణరావు సినీ హీరో ఉదయ్ శంకర్ తెలంగాణ ప్రభుత్వానికి తన వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చారు మంత్రి  పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ ని కలిసి  రూ. 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.  ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు తమ వంతు భాధ్యతగా విరాళం అందజేసినందుకు కేటీఆర్ నిర్మాత అట్లూరి నారాయణ రావు , సినీ హీరో ఉదయ్ శంకర్, తాడికొండ సాయికృష్ణ, వీరపనేని శివ చైతన్య తదితరులను అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి కె టి ఆర్ మాట్లాడుతూ… ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు సాయం చేయటం సాటి మనిషిగా మన కర్తవ్యం. ప్రజల సహకారం వల్లే సినీ రంగం ఈ స్ధాయిలో ఉందని, వరద బాధితులను ఆదుకునేందుకు సినీ పరిశ్రమతో పాటు పారిశ్రామిక వేత్తలు, స్వచ్చంద సంస్ధలు ముందుకు రావాలని  కె టి ఆర్ పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here