సూపర్ స్టార్ రణబీర్ కపూర్, దర్శకుడు అయాన్ ముఖర్జీ S. S. రాజమౌళితో కలిసి “బ్రహ్మాస్త్రం” సినిమా ప్రచారంలో భాగంగా అభిమానులు కలవడం కోసం ‘జ్యుయల్ అఫ్ ది ఈస్ట్ కోస్ట్’ – విశాఖపట్నం నగరాన్ని సందర్శించనున్నారు
సూపర్ స్టార్ రణబీర్ కపూర్, దర్శకుడు అయాన్ ముఖర్జీ మరియు లెజెండరీ ఫిల్మ్ మేకర్ S. S. రాజమౌళి మే 31వ తేదీ మంగళవారం నాడు “బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ” ప్రమోషన్స్ లో భాగంగా ప్రత్యేకమైన ప్రారంభం కోసం విశాఖపట్నం నగరాన్ని సందర్శించనున్నారు.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరక్కెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. తెలుగులో “బ్రహ్మాస్త్రం” మొదటి మోషన్ పోస్టర్‌ను డిసెంబర్‌లో హైదరాబాద్‌లో ఎస్.ఎస్.రాజమౌళి ప్రదర్శించారు. చిత్రబృందం విశాఖపట్నం సందర్శించి సినిమా విడుదల దిశగా ప్రయాణం ప్రారంభించనుంది. రణబీర్, అయాన్ మరియు ఎస్.ఎస్.రాజమౌళి ప్రఖ్యాతి గాంచిన మరియు చారిత్రాత్మకమైన సింహాచలం దేవాలయం ను ముందు దర్శించుకుని ఆ తరువాత “ఐకానిక్ మెలోడీ థియేటర్” లో అభిమానులను కలవనున్నారు.
2022 లో రిలీజ్ కాబోతున్న అతిపెద్ద భారీ బడ్జెట్ సినిమాల్లో “బ్రహ్మాస్త్రం” సినిమా కూడా ఒకటి, ఈ సినిమా కోసం సినీప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోషన్ పోస్టర్ నుండి “కుంకుమల” టీజర్ వరకు అన్ని ఈ సినిమా భారీ అంచనాలను పెంచుతున్నాయి.
స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించాయి మాగ్నమ్ ఓపస్ సెప్టెంబర్ 9, 2022న
హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో రిలీజ్ చేయనుంది. అమితాబ్ బచ్చన్, రణబీర్, అలియా భట్, మౌని రాయ్ మరియు నాగార్జున అక్కినేని లాంటి భారీ తారాగణం ఈ సినిమాలో కనిపించనున్నారు.
నటీనటులు: రణబీర్ కపూర్, అలియాభట్, మౌనిరాయ్ , అమితాబ్ బచ్చన్ , షారుఖ్ ఖాన్ , నాగార్జున, తదితరులు.
దర్శకత్వం : ఆయాన్ ముఖర్జీ
ప్రొడక్షన్: స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్
సంగీత దర్శకులు : ప్రీతమ్