రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ KGF Chapter 2. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ, క్రేజీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. పాన్ ిండియా రేంజ్‌లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన KGF Chapter 1కు కొనసాగింపుగా రూపొందుతోన్న చిత్రమిది. ఏప్రిల్ 14న తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతుంది. మార్చి 27న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. కన్నడ ట్రైలర్‌ను శివ రాజ్ కుమార్ విడుదల చేయగా.. తెలుగు ట్రైలర్‌ను రామ్ చరణ్ విడుదల చేశారు…
ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కార్యక్రమాన్ని హోస్ట్ చేశారు. ఈ సందర్భంగా…
శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ ‘‘‘KGF ఛాప్టర్ 2’ వంటి సినిమా చేసినందుకు నిర్మాత విజయ్ కిరగందూర్‌గారికి ధన్యవాదాలు. అలాగే యష్, ప్రశాంత్ నీల్ సినిమాలో లీనమై చేశారు. ట్రైలర్‌ను తెగ ఎంజాయ్ చేశాను. సినిమాను అంతకు మించి ఎంజాయ్ చేస్తామని అర్థమవుతుంది. హీరో యష్ నాకు సోదర సమానుడు. తను హీరోగా ఎదుగుతున్న క్రమం నుంచి తెలుసు. ఇక ఆయన సతీమణి రాధిక మా కుటుంబ సభ్యురాలు. ఏప్రిల్ 14న సినీ ప్రేక్షకులు ‘KGF ఛాప్టర్ 2’ రూపంలో గొప్ప సినిమాను చూడబోతున్నారు’’ అన్నారు.
మంత్రి అశ్వథ్ నారాయణ్ మాట్లాడుతూ ‘‘నేను ఇక్కడకు మంత్రిగానో, సెలబ్రిటీగానో రాలేదు. కేవలం సినిమా ప్రేమికుడిగా వచ్చాను. కర్ణాటక నుంచి ప్రారంభమైన ‘KGF ఛాప్టర్ 2’ ప్రయాణం ఇప్పుడు ప్రపంచానికి చేరింది. అందరూ ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. ట్రైలను చూస్తుంటే హాలీవుడ్ స్ఠాయిలో ఉంది. ఈ సినిమా ఇండియాలోనే కాదు.. ప్రపంచంలోని సినీ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తుంది. అంచనాలకు మించి సినిమా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇండియన్ సినిమాల్లో ఓ మార్క్‌ను క్రియేట్ చేస్తుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ మ్యాజిక్ మేకర్. తనొక రిమార్క్‌బుల్ మూవీ చేశారు. హీరో యష్,ప్రశాంత్ నీల్ కమిట్‌మెంట్‌కు విజయ్ కిరగందూర్ అండగా నిలబడ్డారు ఏప్రిల్ 14న ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకునేంత గొప్పగా ఉంటుంది’’ అన్నారు.
రాకింగ్ స్టార్ యష్ మాట్లాడుతూ ‘‘పునీత్ రాజ్ కుమార్‌గారు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. మనకే కాదు.. యావత్ సినీ ఇండస్ట్రీకి పెద్ద లోటు. ఆయనతోనే హోంబలే ఫిలింస్ ప్రారంభమైంది. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. శివ రాజ్‌కుమార్‌గారు మా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసినందుకు ఆయనకు థాంక్స్. ఇక ‘KGF ఛాప్టర్ 2’ గురించి మాట్లాడాలంటే ఈ సినిమాలో నా ప్రాముఖ్యత అత్యంత తక్కువనే చెప్పాలి. ఈ సినిమా కన్నడ సినీ ప్రేక్షకుల కల. ఇక్కడకు వచ్చిన ప్రతివాళ్లు గత సారి కంటే డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌తో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చారు. ఈ ప్రయాణం వెనుక విజయ్ కిరగందూర్ అనే వ్యక్తి అండగా నిలిచారు. ‘KGF’ గురించి ఆలోచించినప్పుడు, మాట్లాడినప్పుడు చాలా మంది మనల్ని పిచ్చోళ్లు అని అనుకుంటారు. కానీ విజయ్ కిరగందూర్‌గారు మా వెనుక నిలబడ్డారు. మేం ఆశించిన దాని కంటే ఎక్కువగానే మాకు అందించారు. పార్ట్ 1 సక్సెస్ తర్వాత చాలా మంది నాకు క్రెడిట్ అందించారు. కానీ అదంతా వట్టిదే. కానీ.. ఈ సినిమా క్రెడిట్ అంతా ప్రశాంత్ నీల్‌కే దక్కుతుంది. ఈ సినిమా తన కల. ఇలాంటి సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. సినిమాటోగ్రాఫర్ భువన గౌడ, రవి బస్రూర్ సంగీతం సహా పలువురు టెక్నీషియన్స్ సినిమా కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ఇంత గొప్ప వర్కింగ్ టీమ్‌ను ఎక్కడా చూసుండనని గర్వంగా చెప్పగలను.
అనిల్ టడాని, రితేష్, పర్హాన్ అక్తర్, పృథ్వీ రాజ్ కుమార్ వంటి వారు మాపై నమ్మకంతో సినిమాను ప్రేక్షకులకు అందించడానికి ముందుకు వచ్చారు. రవీనాటాండన్ వంటి గొప్ప నటి. ఆమెతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. సంజయ్ దత్ గారు గొప్ప ఫైటర్. ఆయన ఎంత గొప్ప నటి అయినా చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయన ఈ సినిమా కోసం ఎంత కమిట్‌మెంట్‌గా పనిచేశారో అందరికీ తెలుసు. ఆయనకు ఆరోగ్య సమస్యలు వచ్చినా వాటిని అధిగమించి ముందుకు తీసుకెళ్లారు. సాధారణంగా హీరోయిన్స్ ఎక్కువ సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తారు. కానీ.. శ్రీనిధి శెట్టి ఈ సినిమా కోసం ఆరేళ్లు కష్టపడింది. ఇలా ప్రతి ఒక్కరూ ఎంతో ప్రేమించి ఈ సినిమాలో నటించారు. నా అభిమానులకు థాంక్స్. ఇన్నేళ్లు నన్ను అభిమానించారు. వారు నన్ను ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా సినిమా ఉంటుందని నమ్మకంగా చెప్పగలను’’ అన్నారు.
దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ ‘‘‘KGF ఛాప్టర్ 2’ గురించి చెప్పాలంటే 8 ఏళ్ల ముందు జర్నీ ప్రారంభమైంది. ఎప్రిల్ 14న సినిమా ఏంటో మాట్లాడుతుంది. ఈ జర్నీలో భాగమైన ప్రతి ఒక్కరూ ఎంతగానో పేమించి చేశారు. కన్నడలో స్టార్ట్ అయిన ఈ సినిమా ప్రయాణం ఇప్పుడు ఇండియన్ సినిమా ప్రయాణంగా మారింది. ఈ ప్రయాణంలో అందరూ అందించిన సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా ఇలాంటి అలాంటి కామెడీ సక్సెస్ సాధిస్తుందో అని ఇప్పుడే చెప్పలేను కానీ.. ఒకటి మాత్రం చెప్పగలను. వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నికల్ ఫిలిం ఆఫ్ ది వరల్డ్ అని చెప్పగలను. ఈ సినిమాను ఇతర దక్షిణాది భాషల్లో విడుదల చేస్తున్న మా స్నేహితులందరికీ ధన్యవాదాలు. విజయ్ కిరగందూర్ గ్రేట్ ప్రొడ్యూసర్. ఆయన సపోర్ట్ కారణంగానే ఇంత దూరం ట్రావెల్ చేయగలిగాం. ఎప్రిల్ 14న యష్‌ను ఎందుకు రాకింగ్ స్టార్ అంటారో అర్థమవుతుంది. ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్‌ను తనే రాసుకున్నారు. ఈ సినిమాని పునీత్ రాజ్ కుమార్‌గారికి అంకితమిస్తున్నాం’’ అని తెలిపారు.
నిర్మాత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ ‘‘‘KGF ఛాప్టర్ 2’ ట్రైలర్ విడుదల చేసిన శివ రాజ్‌కుమార్‌గారికి ఇతర సినీ పరిశ్రమల్లోని మిత్రులకు ధన్యవాదాలు. యష్, ప్రశాంత్ నీల్ సహా నా KGF ఫ్యామిలీ మెంబర్స్‌కు ధన్యవాదాలు. 8 ఏళ్ల ప్రయాణం. అందరం కలిసి ముందుకు వచ్చాం. ఎప్రిల్ 14న ఇప్పుడు ‘KGF ఛాప్టర్ 2’ తో మీ ముందుకు రాబోతున్నాం. మాతో పాటు మా ఫ్యామిలీ సభ్యులు కూడా ఈ జర్నీలో పార్ట్ అయ్యారు. అందరికీ థాంక్స్’’ అన్నారు.
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ మాట్లాడుతూ ‘‘‘KGF ఛాప్టర్ 2’ కోసం 45 రోజుల పాటు వర్క్ చేశాను. ఈ జర్నీ నాకొక పాఠం. చాలా విషయాలను నేర్చుకున్నాను. అందరం కలిసి ఓ ఫ్యామిలీలా కష్టపడ్డాం. అధీరగా నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్న ప్రశాంత్ నీల్‌గారికి థాంక్స్. ఇప్పటి వరకు ప్రేక్షకులకు పలు పాత్రల ద్వారా గుర్తుండిపోయాను. ఇప్పుడు అధీరగా వాళ్లు నన్ను ప్రేమిస్తారు’’ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో అనిల్ టడాన్, రవీనాటాండన్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి, యష్ సతీమణి రాధిక, ఎస్.ఆర్.ప్రభు, రితేష్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు పాల్గొని ‘KGF ఛాప్టర్ 2’ భారీ విజయం సాధించాలని చిత్ర యూనిట్‌ను అభినందించారు. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్‌స్టార్ ఫర్హాన్ అక్తర్ వీడియో బైట్ ద్వారా ‘KGF ఛాప్టర్ 2’ యూనిట్‌కు అభినందనలు తెలిపారు.