సూర్య ఈటీ తెలుగు టీజర్ విడుదల

0
386

సూర్య, పాండిరాజ్, ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రై. లి ఈటీ తెలుగు టీజర్ రాణా దగ్గుబాటి చేతుల మీద గా విడుదల.

వర్సటైల్ యాక్టర్ సూర్య  హీరోగా పాండురాజ్ డైరెక్ట్ చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఈటి. డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో  విడుదలకానుంది. మార్చి 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈటీ తెలుగు టీజర్ ను రాణా దగ్గుబాటి రిలీజ్ చేశారు.

ఒక్క నిమిషం ఏడు సెకండ్ల నిడివిగల  ఈ  టీజర్  మొత్తం  యాక్షన్  సన్నివేశాలతో  నింపేశారు.  హీరోయిన్, విలన్ లను ఒక్కో ఫ్రేమ్ లో టీజర్ లో చూపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సూర్య మాస్ అవతార్ ను ఎలివేట్  చేశారు. ఓవరాల్ గా టీజర్ తో అంచనాలు పెంచేశారు మేకర్స్. డి ఇమాన్  సంగీతం, ఆర్ రత్నవేలు  సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మేజర్ హైలెట్స్ అని చెప్పొచ్చు

సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమాలో సూర్య జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ కనిపించనుంది. వినయ్ రాయ్ విలన్ గా కనిపించనున్నారు

సత్యరాజ్, రాజ్ కిరణ్, శరణ్య కీలక పాత్రలలో కనిపించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here