దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం ‘పెళ్లి సందD’. దసరా సందర్భంగా విడుదలవువుతన్న ఈ సినిమా ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేశ్ విడుదల చేశారు. ‘‘వెండితెరపై నటుడిగా పరిచయమవుతున్న ‘పెళ్లి సందD’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయనకు, ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అంటూ మహేశ్ టీమ్‌ను అభినందించారు.
‘పెళ్లి సందD’ మూవీని రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేశారు. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల రూపకల్పనలో తన మేజిక్‌ను చూపిన ఈయన ‘పెళ్లిసందD’ లో అతిథి పాత్రలో నటించడం విశేషం. టైటిల్‌కు తగ్గట్టు సినిమా కలర్‌ఫుల్‌గా, ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.
ట్రైలర్ విషయానికి వస్తే.. ట్రైలర్ విషయానికి వస్తే .. హీరో, హీరోయిన్ ఇతర చిత్ర యూనిట్ సభ్యులందరూ పెళ్లిలో చేసే హడావుడితో సందడిగా ఉండే సన్నివేశాలతో ట్రైలర్ ప్రారంభమైంది.
ఇళ్లంతా పెళ్లి సందడితో కళ కళలాడుతుంటే చూడాలనిపిస్తుంది అంటూ రావు రమేశ్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్‌లో పెళ్లి సందడి అంటూ సాగే పాట బ్యాగ్రౌండ్‌గా వినిపిస్తుంది. తనికెళ్లభరణి, పోసాని కృష్ణమురళి, రావు రమేశ్, షకలక శంకర్ అండ్ టీమ్ సరదాగా ఉండే సన్నివేశాలు, హీరో రోషన్, హీరోయిన్ శ్రీలీల మధ్య సాగే అల్లరి పనులు, రొమాంటిక్ సన్నివేశాలతో పాటు మా ఫ్యామిలీ అంతా నీ ఫ్యాన్సేమే మా తాత పేరు నాగేశ్వర్‌రావు, నాన్న పేరు నాగభూషణం, మా అబ్బాయి పేరు నాగచైతన్య అంటూ రాజేంద్రప్రసాద్ నాగుపాముతో చేసే కామెడీ, వెన్నెలకిషోర్-షకలక శంకర్ మధ్య సాగే సరదా సన్నివేశాలతో సాగే ట్రైలర్ సినిమా ఎంత కలర్‌ఫుల్‌గా, ఎంటర్‌టైనింగ్ ఉంటుందో చెప్పకనే చెబుతుంది. మరోవైపు హీరోయిన్ కనపడకుండా పోయినప్పుడు ఎమోషనల్‌గా వెతికే హీరో, హీరోయిన్ తండ్రి ప్రకాశ్‌రాజ్ దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడ హీరో రోషన్ చేసే యాక్షన్…
వదిలించుకోవడానికి నేనేమైనా హోలీకంటిన రంగునా..హోల్ సేల్ అల్లుడ్ని అంటూ రోషన్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్, గుడిలో విలన్స్‌ను చితకొట్టే ఫైట్ ఇవన్నీ సినిమాలో యాక్షన్, ఎమోషనల్ యాంగిల్స్‌ను ఎలివేట్ చేస్తున్నాయి. ట్రైలర్ చివరలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కనిపించడం కొసమెరుపు.
నటీనటులు:
రోషన్, శ్రీలీల, ప్రకాశ్‌రాజ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, సత్యంరాజేష్, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్, అన్నపూర్ణ, జాన్సి, ప్రగతి, హేమ, కౌముది, భద్రం, కిరీటి తదితరులు..
సాంకేతిక వర్గం:
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్త, చంద్రబోస్
సినిమాటోగ్రఫి: సునీల్ కుమార్ నామ
ఎడిటర్: తమ్మిరాజు
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె,
మాటలు: శ్రీధర్ సీపాన
ఫైట్స్: వెంకట్
కొరియోగ్రఫి: శేఖర్ వీజే
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: వి. మోహన్ రావు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయిబాబా కోవెలమూడి
సమర్పణ: కె. కృష్ణమోహన్ రావు
నిర్మాతలు: మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
దర్శకత్వ పర్యవేక్షణ: కె. రాఘవేంద్రరావు బి.ఎ
దర్శకత్వం: గౌరీ రోణంకి.