యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్యల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఎనిమి’. ఇది హీరో విశాల్ 30వ చిత్రం కాగా, ఆర్య 32వ మూవీ. ‘గద్దల కొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ఒక కీలక పాత్రలో నటించారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ అన్ని భాషలలో కలిపి 20 మిలియన్లకి పైగా వ్యూస్ సాధించి సినిమాపై అంఛనాలను భారీగా పెంచింది. కాగా ఈ రోజు ఎనిమి చిత్రం నుండి బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరపరిచిన `పడదే..పడదే` ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
`అదిడే నిను చూసే కనులే నీ స్నేహం కోసం కదిలే..అదిగో నిను చూస్తేనే ఏదో కొంచెం సంతోషములే
చినగా మాటాడే పరలే ఆ మాటలు ఏం సరిపడవే..సరిగా కళ్లల్లోకి నువ్వే చూస్తే మాటే పగిలే..
పడదే.. పడదే.. పడదే.. ఫ్రెండయితే సరిపడదే.. పడదే.. పడదే.. పడదే.. నా మనసుకిదేం పడదే….`అంటూ సాగే ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా పృథ్విచంద్ర ఫుల్ ఎనర్జీతో ఆలపించారు. తమన్ క్యాచీ ట్యూన్ మరోసారి సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. విశాల్, మృణాలిని రవి మధ్య కెమిస్ట్రీ ఈ పాటకి హైలెట్ గా నిలిచింది. ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. సెప్టెంబరులో తెలుగు, తమిళం, హిందీ సహా మరికొన్ని భాషలలో ఈ చిత్రం విడుదలకానుంది.
తారాగణం: యాక్షన్ హీరో విశాల్, ఆర్య, మృణాళిని రవి, మమతా మోహన్ దాస్, ప్రకాశ్‌రాజ్ తదితరులు…
సాంకేతిక నిపుణులు…
దర్శకత్వం: ఆనంద్ శంకర్
నిర్మాత: వినోద్ కుమార్
సంగీతం: తమన్ ఎస్ ఎస్
సినిమాటోగ్రఫీ: డి రాజశేఖర్,
ఆర్ట్: టి. రామలింగం
ఎడిటర్: రేమండ్ డెరిక్ క్రాస్టా
యాక్షన్: రవివర్మ