సునీల్‌, ధ‌న‌రాజ్ కాంబినేష‌న్‌లో గ‌రుడ‌వేగ అంజి, జి.నాగేశ్వ‌ర రెడ్డి టీమ్ వ‌ర్క్ ప్రొడ‌క్ష‌న్ నెం.2 చిత్రం `బుజ్జి ఇలా రా`…. టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

0
67

కొన్ని చిత్రాల్లో క‌మెడియ‌న్స్‌గా క‌లిసి మెప్పించిన సునీల్‌, ధ‌న‌రాజ్ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న లేటెస్ట్ మూవీకి `బుజ్జి ఇలా రా` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. `ఇట్స్ ఎ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్` అనేది ట్యాగ్‌లైన్‌. అంద‌రిలో ఆస‌క్తిని క్రియేట్ చేస్తోన్న ఈ టైటిల్ పోస్ట‌ర్‌తోనే సినిమా సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ మూవీ అని అర్థ‌మ‌వుతుంది.

సినిమాటోగ్రాఫర్ గ‌రుడ‌వేగ అంజి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రాఫ‌ర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నారు. రూపా జ‌గ‌దీశ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పి, జీ నాగేశ్వ‌ర‌రెడ్డి టీమ్ వ‌ర్క్ ప‌తాకాల‌పై అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సాయికార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి భాను, నాయుడు మాట‌ల‌ను అందిస్తున్నారు.

చాందిని త‌మిళ‌ర‌స‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది.

న‌టీన‌టులు:
సునీల్‌, ధ‌న‌రాజ్‌, చాందిని త‌మిళ‌ర‌స‌న్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, శ్రీకాంత్ అయ్య‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, వేణు, భూపాల్‌, టెంప‌ర్ వంశీ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

క‌థ‌, స్క్రీన్ ప్లే: జి.నాగేశ్వ‌ర రెడ్డి
సినిమాటోగ్ర‌పీ, ద‌ర్శ‌క‌త్వం: గ‌రుడ‌వేగ అంజి
నిర్మాత‌లు: అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ రెడ్డి
స‌మ‌ర్ప‌ణ‌: రూపా జ‌గ‌దీశ్‌
బ్యాన‌ర్స్‌: జి.నాగేశ్వ‌ర రెడ్డి టీమ్ వ‌ర్క్‌, ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పి
మ్యూజిక్‌: సాయి కార్తీక్‌
డైలాగ్స్‌: భాను,నాయుడు
ఆర్ట్‌: చిన్నా
ఎడిట‌ర్‌: చోటా కె.ప్ర‌సాద్‌
ఫైట్స్: రియ‌ల్ స‌తీశ్‌
కాస్ట్యూమ్స్‌: మ‌నోజ్‌
మేక‌ప్‌: వాసు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సీతారామరాజు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here