నిర్మ‌ల్ బొమ్మ‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన `రాధాకృష్ణ` సినిమాని ప్ర‌తి ఒక్క‌రూ చూసి ప్రోత్స‌హించాలని కోరుకుంటున్నాను – తెలంగాణ‌రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

0
396

ప్ర‌ముఖ ద‌ర్శకుడు`ఢ‌మ‌రుకం`ఫేమ్ శ్రీనివాస‌రెడ్డి స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణలో రూపొందుతున్న చిత్రం ‘రాధాకృష్ణ‌’. అనురాగ్‌, ముస్కాన్ సేథీ(పైసా వ‌సూల్ ఫేమ్‌) హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో నంద‌మూరి లక్ష్మీ పార్వతి ఒక కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్నిహ‌రిణి ఆరాధ్య‌ క్రియేష‌న్స్ ప‌తాకంపై పుప్పాల సాగ‌రిక కృష్ణ‌కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని పాట‌లు ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ‌వుతున్నాయి. ఇప్ప‌‌టికే విడుద‌లైన సాంగ్స్‌, ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఫిబ్ర‌వ‌రి5న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ హైద‌రాబాద్ ద‌స‌ప‌ల్లా హోట‌ల్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ రాష్ట్ర అట‌వీ,ప‌ర్యావ‌ర‌ణ‌,దేవాదాయ‌,న్యాయ‌శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రై `రాధాకృష్ట` మూవీ బిగ్‌టికెట్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా..

తెలంగాణ‌రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ – “నూత‌నంగా ఏర్ప‌డిన నిర్మ‌ల్ జిల్లాలో ప్ర‌కృతి మ‌నకిచ్చిన ప్ర‌సాదం విశాల‌మైన అడ‌వి, కుంటాల జ‌ల‌పాతం, క‌వ్వాల్ టైగ‌ర్‌జోన్. ఇలాంటి అంద‌మైన లోకేష‌న్స్‌లో `రాధాకృష్ణ` మూవీ చిత్రీక‌రించ‌డం నిజంగా అభినందించాల్సిన విష‌యం. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతిగాంచిన నిర్మ‌ల్ కొయ్య‌ బొమ్మ‌ల నేఫ‌థ్యంలో, అంత‌రించిపోతున్న హ‌స్త క‌ళ‌లు, క‌ళాకారుల గురించి సాగ‌రిక కృష్ణ‌కుమార్‌గారు మంచి క‌థ‌ను ఎంచుకుని ఈ సినిమాని నిర్మించారు. వారికి నా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. నిర్మ‌ల్ బోమ్మ‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ప్ర‌తి ఒక్క‌రూ చూసి ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉంది. అలాగే లక్ష్మి పార్వ‌తిగారు ఈ చిత్రంలో ఒక ప్ర‌ధాన పాత్ర పోషించడం చాలా సంతోష‌క‌ర‌మైన విష‌యం. హీరో అనురాగ్‌, హీరోయిన్ ముస్కాన్ సేథీల‌కు ఈ సినిమా మంచి పేరు తేవాల‌ని ఆశిస్తున్నాను. అలాగే అలీ, కృష్ణ భ‌గ‌వాన్ గారు ఈ సినిమాలో న‌టించ‌డం జ‌రిగింది వారికి నా అభినంద‌న‌లు. ఎం.ఎం.శ్రీ‌లేఖ‌గారు మంచి సంగీతం అందించారు వారికి, ఈ సినిమాలో నిర్మ‌ల బొమ్మా పాట పాడిన మంగ్లీగారికి అభినంద‌న‌లు. అలాగే శ్రీ‌నివాస రెడ్డిగారు చాలా ఎక్స్‌పీరియ‌న్స్ డైరెక్ట‌ర్ వారు ఈ సినిమాని ముందుండి న‌డిపారు. పూర్తిగా తెలంగాణలోని నిర్మ‌ల్‌ జిల్లాలోనే చిత్రీక‌రించిన సినిమా అందులోనూ నిర్మ‌ల్ క‌ళాకారుల క‌ష్టాల నేప‌థ్యంలో మంచి ఆశ‌యంతో తీసిన కాబ‌ట్టి త‌ప్ప‌కుండా ఈ విష‌యాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీనుకెళ్తాను. ఈ మూవీ పెద్ద స‌క్సెస్ కావాల‌ని ఆ భ‌గ‌వంతున్ని ప్రార్ధిస్తున్నాను“ అన్నారు.

ఏపీ తెలుగు అకాడమీ అధ్యక్షురాలు ల‌క్ష్మీ పార్వ‌తి మాట్లాడుతూ – “ఏ దేశపు నాగ‌రిక‌త అయినా ముందుకుపోవాలి అంటే వారి ప్రాచీన సంస్కృతి, సాంప్ర‌దాయాల మీదే ఆధార‌ప‌డి ఉంటుంది. వాటిని ఎవ‌రైతే నిల‌బెట్టుకుంటారో ఆ దేశం ఎన్ని సంవ‌త్స‌రాలైన మ‌నుగ‌డ సాగిస్తుంది. ఆ ప్రాచీన క‌ళ‌ల్ని కాపాడుకుంటూ వ‌స్తుంది కాబ‌ట్టే మ‌న భార‌త‌దేశం ప్ర‌పంచ‌దేశాల్లో మ‌కుటాయ‌మానంగా ఉంది. ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని ఎన్నో అద్భుత‌మైన‌ క‌ళ‌ల‌కు భార‌త‌దేశం పుట్టినిల్లు. అలాంటి ప్రాచీన క‌ళ‌ల‌ను మ‌నం కోల్పోతే మ‌న మ‌నుగ‌డ‌నే మ‌నం కోల్పోవాల్సి వ‌స్తుంది. నిర్మ‌ల్ కొయ్య‌ బొమ్మలు ఎంత ఫేమ‌స్ అనేది మ‌నంద‌రికీ తెలుసు. నిర్మ‌ల్ బొమ్మ‌లు అంటేనే ఒళ్లు పుల‌క‌రిస్తుంది. అంత‌రించి పోతున్న నిర్మ‌ల్ క‌ళ‌ల‌ను క‌థ‌గా తీసుకుని ఒక మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు. ఒక మంచి చిత్రానికి మీ అంద‌రి ఆద‌ర‌ణ త‌ప్ప‌క ఉండాల‌ని కోరుకుంటున్నాను. శ్రీ‌నివాస్ రెడ్డి గారు నాతో ప‌ట్టుబ‌ట్టి ఈ సినిమాలో ఒక పాత్ర చేయించ‌డం జ‌రిగింది. చిత్ర యూనిట్, నిర్మ‌ల్ ప్ర‌జ‌లు అంద‌రూ ఎంతో ప్రేమ‌తో నన్ను చాలా బాగా చూసుకున్నారు. నా పాత్ర ఎలా చేశాను అన్న‌ది రేపే థియేట‌ర్‌లో ఆడియ‌న్స్ చూసి చెప్పాలి. ఒక గొప్ప ఉద్ధేశ్యంతో మంచి సినిమా తీసిన సాగ‌రిక కృష్ణ‌కుమార్ గారికి నా అభినంద‌న‌లు. అలి ఇందులో ఒక మంచి క్యారెక్ట‌ర్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి చిత్రానికి మీ అంద‌రి ఆద‌ర‌ణ త‌ప్ప‌క ఉండాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస‌రెడ్డి మాట్లాడుతూ – “ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి ఇంద్ర క‌ర‌ణ్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా రావ‌డం మా అదృష్టంగా భావిస్తున్నాం. ల‌క్ష్మీ పార్వ‌తిగారు ఈ సినిమాలో ఒక కీల‌క పాత్ర‌లో న‌టించ‌డం ఒక గొప్ప విష‌యం. ఆమె ఆ క్యారెక్ట‌ర్ చేయ‌డంతో సినిమాకే ఒక అందం వచ్చింది. రేపు సినిమా రిలీజ‌య్యాక మీరు ఇదే విష‌యం చెప్తార‌ని ఆశిస్తున్నాను. అంత‌రించిపోతున్న నిర్మ‌ల్ క‌ళ‌ల‌ని బ్ర‌తికించాల‌ని ఒక మంచి పాయంట్‌తో ఈ స‌బ్జెక్ట్ నా ద‌గ్గ‌ర‌కి తీసుకువ‌చ్చిన‌ప్పుడు నాకు చాలా బాగా అనిపించి ఈ సినిమాకి ద‌ర్శ‌కత్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేయ‌డం జ‌రిగింది. ఈ సినిమా విజ‌య‌వంతం అయ్యి మొద‌టిసారి నిర్మాత‌గా అడుగుపెట్టిన కృష్ణ‌‌కుమార్ గారికి డ‌బ్బులు రావాల‌ని అలాగే ప్ర‌సాద్ వ‌ర్మ‌కి మంచి భ‌విష్య‌త్ ఉండాల‌ని కోరుకుంటున్నా. అనురాగ్ ముస్కాన్ సేథీ చాలా బాగా న‌టించారు. కేవ‌లం ప్రేమ‌క‌థా చిత్రంగానే కాకుండా అంత‌రించి పోతున్న హ‌స్త‌క‌ళ‌ల‌ను బ్ర‌తికించాలి అని ఒక మంచి మెసేజ్ కూడా ఇస్తున్నాం. కృష్ణ‌భ‌గ‌వాన్‌, అలీ కాంభినేష‌న్లో మంచి కామెడీ ట్రాక్ ఉంటుంది. సురేందర్ రెడ్డిగారు గొప్ప కెమెరామెన్‌. ప్రతి సీన్‌ను ఎక్సలెంట్‌గా విజువలైజ్‌ చేశారు. ఎం.ఎం శ్రీ‌లేఖ‌గారి మ్యూజిక్ ఈ సినిమాకి త‌ప్ప‌కుండా ప్ల‌స్ అవుతుంది. మంచి టెక్నీషియ‌న్స్‌తో, మంచి ఆర్టిస్టుల‌తో చేసిన ఈ సినిమాని ప్ర‌తి ఒక్క‌రూ ఆద‌రించి పెద్ద హిట్ చేయాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

చిత్ర నిర్మాత పుప్పాల సాగ‌రిక‌ కృష్ణ‌కుమార్ మాట్లాడుతూ – “మా నిర్మ‌ల్ జిల్లాలో అంత‌రించి పోతున్న నిర్మ‌ల్ బొమ్మ‌లు, ఆ క‌ళాకారులు ప‌డుతున్న ఇబ్బందుల‌ను గురించి తెలియ‌జేస్తూ ఆ క‌ళ‌ని బ్ర‌తికించాల‌ని ఒక మంచి సంక‌ల్పంతో ఈ చిత్రాన్ని నిర్మించ‌డం జ‌రిగింది. ఫిబ్ర‌వ‌రి 5న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఈ సినిమాని విడుద‌ల చేస్తున్నాం. ఇక లక్ష్మీపార్వతి గారు ఈ సినిమాలోమొద‌టి సారి ఈ సినిమాలో ఒక కీల‌క‌పాత్ర‌లో అద్భుతంగా న‌టించారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఎం.ఎం.శ్రీలేఖగారు అద్భుతమైన సంగీతాన్నిఅందించారు. సురేందర్ రెడ్డిగారు గొప్ప కెమెరామెన్‌. ప్రతి సీన్‌ను ఎక్సలెంట్‌గా విజువలైజ్‌ చేశారు. ప్రసాద్‌ వర్మగారుప్ర‌సాద్ వ‌ర్మ ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. అనురాగ్‌, ముస్కాన్ సేథీ చ‌క్కగా న‌టించారు. వారికి మంచి భ‌విష్య‌త్ ఉండాల‌ని కోరుకుంటున్నాను. మాకు బ్యాన్‌బోన్‌గా నిలిచిన డ‌మ‌రుకం శ్రీనివాస్‌ రెడ్డిగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. కేవ‌లం నిర్మ‌ల్ బొమ్మ‌ల గురించే కాదు ఒక అద్భుత‌మైన ప్రేమ‌కావ్యంగా నిలిచిపోతుంది అని న‌మ్మ‌కం ఉంది. మా హ‌రిణి ఆరాధ్య‌ క్రియేష‌న్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ ‘రాధాకృష్ణ’ సినిమాను ఫిబ్ర‌వ‌రి5న ప్ర‌తి ఒక్క‌రూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌సాద్ వ‌ర్మ మాట్లాడుతూ – “ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ అవ‌కాశం ఇచ్చిన కృష్ణ‌కుమార్‌గారికి నా జీవితాంతం రుణ‌ప‌డిఉంటాను. ఎం.ఎం. శ్రీ‌లేఖ గారు ఐదు మంచి పాట‌లు ఇచ్చారు. ప్ర‌తిక్ష‌ణం నా వెన్నంటే ఉంటూ ఈ సినిమా ఇంత బాగా రావ‌డానికి ఎంతో స‌హ‌కారం అందించిన మా గురువుగారు శ్రీ‌నివాస్ రెడ్డి గారు ఆయ‌న్ని నా జీవితంలో మ‌ర్చిపోలేను. ప‌ల్లెటూరి నేప‌థ్యంలో ఒక అంద‌మైన ల‌వ్‌స్టోరీతో పాటు హస్తకళలకు సంభందించిన మంచి పాయంట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డం జ‌రిగింది. త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ న‌చ్చుతుంది“ అన్నారు.

హీరో అనురాగ్ మాట్లాడుతూ – “ఇంత మంచి సినిమాలో అవ‌కాశం ఇచ్చిన శ్రీ‌నివాస్ రెడ్డి గారికి, సాగ‌రిక కృష్ణ‌కుమార్ గారికి థ్యాంక్స్. శ్రీ‌లేఖ మేడ‌మ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలీ, కృష్ణ‌భ‌గ‌వాన్‌, సంపూర్ణేష్ బాబు గారితో న‌టించ‌డం చాలా గొప్ప విష‌యం. మంచి ఫ్యామిలీఎంట‌ర్‌టైన‌ర్ మీరంద‌రు చూసి మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించాలని కోరుకుంటున్నాను“అన్నారు.

హీరోయిన్ ముస్కాన్ సేథీ మాట్లాడుతూ – “రాధాకృష్ణ నా మ‌న‌సుకి చాలా ద‌గ్గ‌రైన సినిమా. కేవ‌లం ఎంట‌ర్‌టైన్‌మెంట్ మాత్ర‌మే కాకుండా మంచి సందేశం కూడా ఉంది. ఈ అవ‌కాశం ఇచ్చిన శ్రీ‌నివాస్ రెడ్డి గారికి, సాగ‌రిక కృష్ణ‌కుమార్ గారికి నా హృద‌య‌పూర్వ‌క ద‌న్య‌వాదాలు. ఇది నాకు డ్రీమ్ ప్రాజెక్ట్‌లాంటిది. మంచి పాట‌లు ఇచ్చిన ఎం.ఎం. శ్రీ‌లేఖ గారికి థ్యాంక్స్‌. ల‌క్ష్మి పార్వ‌తి మేడ‌మ్ గారితో క‌లిసి న‌టించ‌డం చాలా గొప్ప విష‌యం“ అన్నారు.

సంగీత ద‌ర్శ‌కురాలు ఎం.ఎం శ్రీ‌లేఖ మాట్లాడుతూ – “రాధాకృష్ణ సినిమా ఒక మ్యూజిక‌ల్ ఫీస్ట్‌లా ఉంటుంది. మంచి పాట‌లు కుదిరాయి‌. సుద్దాల అశోక్ తేజ‌గారు, శ్రీ‌మ‌ణి, చైత‌న్య ప్ర‌సాద్‌, వ‌రికుప్పల యాద‌గిరి లాంటి బిగ్‌ రైట‌ర్స్ ఈ సినిమాకి పాట‌లు రాయడం జ‌రిగింది, రాహుల్ సిప్లిగంజ్‌, మంగ్లీ, అనురాగ్ కుల‌క‌ర్ణి లాంటి బిగ్ సింగర్స్ పాడారు. ఈ అవ‌కాశం ఇచ్చిన సాగ‌రిక కృష్ణ‌కుమార్ గారికి నా స్పెష‌ల్ థ్యాంక్స్‌. ఫిబ్ర‌వ‌రి 5న అంద‌రూ సినిమా చూడండి త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు“ అన్నారు.

న‌టుడు ఆలీ మా‌ట్లాడుతూ – “ఇప్పుడున్న పిల్ల‌ల‌కి నిర్మ‌ల్‌బొమ్మ‌లు అంటే తెలియ‌క‌పోవ‌చ్చు కాని ఈ సినిమాతో వాటి గొప్ప‌ద‌నం త‌ప్ప‌కుండా అంద‌రికీ తెలుస్తుంది. నిర్మ‌ల్ బొమ్మ మీద తీసిన ఈ సినిమా డెఫినెట్ గా పెద్ద హిట్ అవుతుంది. హీరో హీరోయిన్లు చ‌క్క‌గా న‌టించారు. ద‌ర్శ‌కుడు ప్ర‌సాద్ వ‌ర్మ అద్బుతంగా తెర‌కెక్కించారు“ అన్నారు.

ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ వ‌రంగ‌ల్ శ్రీ‌ను మాట్లాడుతూ – “400 సంవ‌త్స‌రాల చ‌రిత్ర ఉన్న నిర్మ‌ల్‌బొమ్మ‌ల గురించి తీసిన ఈ సినిమా త‌ప్ప‌కుండా మంచి స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. నిర్మాత సాగ‌రిక కృష్ణ‌కుమార్ గారికి అలాగే టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌“ అన్నారు.

అనురాగ్‌, ముస్కాన్ సేథీ(పైసా వ‌సూల్ ఫేమ్‌), ల‌క్ష్మీ పార్వ‌తి, అలీ, కృష్ణ భ‌గ‌వాన్‌, అన్న‌పూర్ణ‌మ్మ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ: సురేంద‌ర్ రెడ్డి, సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ‌, ఎడిటింగ్‌: డి. వెంక‌ట‌ప్ర‌భు, ఆర్ట్: వి. ఎన్ సాయిమ‌ణి, నిర్మాణ సార‌థ్యం: కృష్ణ కుమార్‌, నిర్మాత‌: పుప్పాల సాగ‌రిక‌ కృష్ణకుమార్, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: శ్రీనివాస రెడ్డి, ద‌ర్శ‌క‌త్వం: టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here