పి19 ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం(ప్రొడక్షన్ నెంబర్3)లో సముద్రఖని

0
375

యువ వ్యాపారవేత్త, ‘క్రియేటివ్‌ మెంటార్స్‌ యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ కాలేజీ’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) కొవ్వూరి సురేష్‌రెడ్డి సినిమా నిర్మాణంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పి19 ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థను స్థాపించిన ఆయన అక్టోబర్‌లో మూడు చిత్రాలను ప్రకటించారు.

ప్రదీప్‌ మద్దాలి దర్శకత్వంలో పి19 ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 3గా కొవ్వూరి సురేష్ రెడ్డి ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలో నటుడు, దర్శకుడు సముద్రఖని నటించనున్నారు. ఈ విషయాన్ని దర్శక, నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా దర్శకుడు ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ “విలేజ్ డాన్ క్యారెక్టర్‌లో సముద్రఖని గారు కనిపిస్తారు. ఆయనకు కథతో పాటు పాత్ర కూడా విపరీతంగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పారు. ఇతర వివరాలు త్వరలో చెబుతాం” అని అన్నారు.

నిర్మాత కొవ్వూరి సురేష్ రెడ్డి మాట్లాడుతూ “ప్రతిభావంతులైన నటుల్లో దర్శకుడు సముద్రఖని ఒకరు. ఆయనను మా సినిమాలోకి తీసుకోవడం సంతోషంగా ఉంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తాం. అతి త్వరలో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు.

గతంలో పూరి జగన్నాథ్‌ దగ్గర పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన ప్రదీప్ మద్దాలి… ‘పెళ్ళి గోల’ వెబ్‌ సిరీస్‌, జీ5 ఎక్స్‌క్లూజివ్‌ మూవీ ’47 డేస్‌’కి దర్శకత్వం వహించారు. ఓ మంచి కథతో పి19 ఎంటర్‌టైన్‌మెంట్స్ లో చిత్రం చేస్తున్నారు.

ఈ చిత్రానికి  స్వరాలు: రఘు కుంచె, నిర్మాణ సంస్థ: పి19 ఎంటర్‌టైన్‌మెంట్స్, రచన-దర్శకత్వం: ప్రదీప్ మద్దాలి, నిర్మాత కొవ్వూరి సురేష్ రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here