ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రగాఢ సంతాపం

0
442

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి కి దిగ్భ్రాంతిని, ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి నిర్మాతల మండలి అధ్యక్షులు శ్రీ C కళ్యాణ్..కార్యదర్సులు..శ్రీ ప్రసన్నకుమార్.. మోహన్ వడ్లపట్ల..కోశాధికారి..తుమ్మలపల్లి రామ సత్యనారాయణ. మరియు కమిటీ మెంబెర్స్ .ప్రగఢ సానుభూతి వ్యక్తం చేశారు.

గత నెల 5 న కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఆయన కరోనా నుండి కోలుకున్నారని తెలియగానే ఎంతో సంతోషించామని, ఆసుపత్రి నుండి తిరిగివచ్చి మళ్లీ తన ప్రస్థానాన్ని కొనిసాగిస్తారని ఎంతగానో ఆశించామన్నారు. అయితే ఇతర అనారోగ్యసమస్యలతో తిరిగిరాని లోకాలకు ఆయన వెళ్లిపోతారని ఊహించలేదనే ఆవేదనను ఆయన వ్యక్తంచేశారు. ఆయన మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటని, ఆ లోటుని ఎవరూ భర్తీచేయలేరన్నారు. ఆర్టిస్టు కంఠానికి తగ్గట్టుగా పాడటం ఆయనలో ఉన్న గొప్పతనం అని, అది దేముడు ఇచ్చిన వరం అన్నారు. ఆనేక చిత్రాల్లోని పాటలన్నీ ఎప్పటికీ చిరస్తాయిగా ఉండిపోతాయన్నారు. 17 బాషల్లో సుమారు 40వేల పాటలు పాడిన గొప్పగాయకుడు అని, వివిధ విభాగాల్లో 25 నంది అవార్డులను పొందిన గొప్ప గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని ప్రశంశించారు. మహా గాయకుడు అని అధ్యక్షుడు C.కళ్యాణ్ కొనియాడారు.

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి.హైదరాబాద్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here