ఎస్ పి బాలసుబ్రమణ్యం గాయకుడిగా ఎదుగుతున్న తరుణంలో నేను హీరోగా నటించిన నేనంటే నేనే చిత్రంలోని అన్ని పాటల్ని బాలు తో పాడిద్దామని సంగీత దర్శకులు ఎస్ పి కోదండపాణి గారు ప్రపోజల్ పెట్టినప్పుడు డూండీ గారు, నేను వెంటనే ఓకే అన్నాం. అలా బాలు ఒక సినిమాలోని అన్ని పాటలూ పాడే అవకాశాన్ని నేనంటే నేనే తో దక్కించుకున్నారు. ఆ పిక్చర్ సూపర్ హిట్ అయ్యింది. సింగర్ గా బాలు ని బిజీ చేసింది. ఘంటసాల గారు పీక్ లో ఉన్నప్పుడు కూడా నా సినిమాలన్నిటికీ బాలు నే పాడేవాడు. వ్యక్తిగతంగా కూడా మేము ఎంతో ఆత్మీయులం. అలాంటి బాలు హఠాత్తుగా దూరం అవడం నాకు ఎంతో బాధగా ఉంది. బాలు మనతో లేకపోయినా ఆయన పాడిన అద్భుతమైన పాటలతో మనతో కలిసే ఉంటారు. బాలు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబానికి నా సంతాపాన్ని తెలియచేస్తున్నాను.
– కృష్ణ