కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత వెంకటేష్ కొత్తూరి నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ”మెరిసే మెరిసే”. ఈ చిత్రంలో హుషారు ఫెమ్ దినేష్ తేజ్ హీరోగా నటిస్తుండగా శ్వేతా అవస్తీ హీరోయిన్ గా నటిస్తోంది. కామెడీ, లవ్, ఎమోషన్స్ తో కూడిన ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు పవన్ కుమార్.కె మాట్లాడుతూ…
ప్రస్తుతం మెరిసే మెరిసే చిత్రం డిఐ వర్క్స్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన మా సినిమా థీమ్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. మా మూవీ ఫస్ట్ లుక్ ను దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. హీరో దినేష్, హీరోయిన్ శ్వేతా అవస్తి బాగా నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మా సినిమా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని తెలిపారు.
నటీనటులు:
దినేష్ తేజ్, శ్వేతా అవస్తి, సంజయ్ స్వరూప్, గురు రాజ్, బిందు, సంధ్య జనక్, మని, కాటలిన్, శశాంక్, నానాజీ
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: కొత్తూరి ఎంటర్త్సైన్మెంట్స్
నిర్మాత: వెంకటేష్ కొత్తూరి
దర్శకత్వం: పవన్ కుమార్. కె
కెమెరామెన్: నగేష్ బన్నెల్
సంగీతం: కార్తిక్ కొడగండ్ల