అఖిల్ అక్కినేని – సురేందర్ రెడ్డి – అనిల్ సుంకర ల కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్

0
433

ఎదురుచూస్తున్న బిగ్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది !!!!
యంగ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. చిరంజీవి సైరా నరసింహా రెడ్డి తో బ్లాక్ బస్టర్ కొట్టిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా భారీ సినిమా రూపొందనుంది. వక్కంతం వంశీ అందించిన పవర్ ఫుల్ స్టొరీ తో ఈ చిత్రం భారీ స్థాయి లో రూపొందనుంది . అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి ల క్రేజీ కాంబినేషన్ లో రానున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఎ కే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సరెండర్2సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు.

ఈ సంద‌ర్భంగా యంగ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ – “ఇట్స్ టైమ్‌! సురేంద‌ర్ రెడ్డి, అనీల్‌సుంక‌ర గారితో నా సినిమా అనౌన్స్ చేయ‌డం హ్యాపీగా ఉంది. ఇది నాకు ఎక్స్‌ట్రీమ్‌లి స్పెష‌ల్ మూవీ. పూర్తి ఉత్సాహంతో త్వ‌ర‌లోనే షూటింగ్ స్టార్ట్ చేస్తాం“అన్నారు.

స్టార్ డైరెక్టర్ సురేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ – “ అకిల్ అక్కినేనితో నా సినిమా ప్ర‌క‌టించ‌డం హ్యాపీగా ఉంది. మిగ‌తా వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం“అన్నారు.

నిర్మాత అనీల్ సుంక‌ర మాట్లాడుతూ – “ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని రూపొందించ‌డానికి చాలా ఉత్సాహంగా, ఆస‌క్తిగా ఉన్నాం. ఈ కాంభినేష‌న్ అంద‌రి అంచ‌నాల‌ను మించి పోయేలా ఉంటుంది. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు.

తన చిత్రాల్లో హీరోలను అత్యంత స్టైలిష్ గా ప్రజెంట్ చేసే దర్శకుడు సురేందర్ రెడ్డి, అఖిల్ అక్కినేని 5వ చిత్రంలో అఖిల్ ని సరికొత్తగా ఆవిష్కరించనున్నారు. 2020 సంవత్సరాన్ని సరిలేరు నీకెవ్వరు లాంటి భారీ బ్లాక్ బస్టర్ తో ప్రారంభించిన ఏకే ఎంటర్టెన్మెంట్స్ బిగ్ స్కేల్ లో నిర్మించనున్న అఖిల్ 5తో తన విజయపరంపరను కొనసాగించనుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

హీరో: అఖిల్ అక్కినేని

దర్శకత్వం: సురేందర్ రెడ్డి

నిర్మాత: రామబ్రహ్మం సుంకర

కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here