జాన్వీ కపూర్ ‘గుంజన్ సక్సేనా’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నెట్ ఫ్లిక్స్

0
445
'గుంజన్ సక్సేనా' మూవీ

‘ధఢక్’ మూవీ తో బాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది దివంగత అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్. ఫస్ట్ మూవీతోనే మంచి సక్సెస్ అందుకున్న జాన్వీ, ప్రస్తుతం గుంజన్ సక్సేనా, రూఅఫ్జానా, దోస్తానా 2 సినిమాల్లో నటిస్తున్నారు. కాగా వాటిలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గుంజన్ సక్సేనా’ మూవీ స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 12న ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. కాగా ఈ విషయాన్ని కాసేపటి క్రితం సినిమా యూనిట్ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది. ఈ సినిమా కోసం జాన్వీ, ఫ్లైట్ నడపడం సహా పలు ఇతర యుద్ధ విద్యలు నేర్చుకున్నారు.

తన అమితమైన ధైర్య సాహసాలతో 1999 కార్గిల్‌ యుద్ధం సమయంలో గాయాలపాలైన సైనికులను విమానంలో ఎక్కించుకుని సురక్షిత ప్రాంతానికి తరలించిన మ‌హిళా పైల‌ట్ గుంజ‌న్, అనంతరం అందరి నుండి ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఆమె చేసిన సాహసోపేతమైన పనికి మెచ్చి, అప్పటి ప్ర‌భుత్వం శౌర్య‌వీర్ అవార్డ్ ని ఆమెకు ప్రకటించడం జరిగింది. కాగా ఆ యుద్ధ సమయంలో జరిగిన ఘటనలు, అలానే ఆ యుద్ధంలో పాల్గొన్న మొట్టమొదటి భారత మహిళా పైలట్ అయిన గుంజన్ జీవితంలోని పరిస్థితులను వివరిస్తూ ఈ సినిమాలో చూపించనున్నారు. యువ దర్శకుడు శరన్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, జీ స్టూడియోస్ తో కలిసి ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో జాన్వీ తండ్రిగా ప్రముఖ నటుడు పంక‌జ్ త్రిపాఠి నటిస్తుండగా, మరొక నటుడు అంగద్ బేడీ జాన్వీకి సోదరుడిగా కనిపించనున్నారు……!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here